రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం బెంగళూరులో న్యూజిలాండ్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం రవీంద్ర జడేజా వేసిన 37వ ఓవర్లో రిషబ్ పంత్ కాలికి గాయం అయ్యింది.
న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. మొదటి టెస్టు రెండోరోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై కివీస్ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా స్టార్ బ్యాటర్లు కుదేలయ్యారు. రోహిత్ శర్మ (2) ఖాతా తెరవగా.. విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు డకౌట్ అయ్యారు. ప్రస్తుతం భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ ఆడుకుంటేనే భారత్ కోలుకుంటుంది.…
Delhi Capitals Retention List for IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలం కోసం రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ప్రతీ ప్రాంచైజీకి ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో ఒకరైనా అన్క్యాప్డ్ ప్లేయర్ (జాతీయ జట్టుకు ఆడని ఆటగాడు) ఉండాలి. విదేశీ ఆటగాళ్లపై బీసీసీఐ ఎలాంటి పరిమితి విధించలేదు. అయితే తొలి ఐదుగురు ఆటగాళ్లకు కలిపి గరిష్ట పరిమితి రూ.75 కోట్లుగా నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి తమకు నచ్చిన…
ఐపీఎల్ 2025 మెగా వేలంకు ముందు ఫ్రాంఛైజీలు ఎంత మందిని రిటైన్ చేసుకోవచ్చనే దానిపై స్పష్టత వచ్చింది. ప్రతి ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్ పాలకవర్గం అనుమతిని ఇచ్చింది. ఇందులో ఓ రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఉంది. నవంబర్‌లో వేలం జరిగే అవకాశాలు ఉన్నాయి. మెగా వేలానికి ముందు ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. తమను రిషబ్ పంత్‌ను కచ్చితంగా రిటైన్ చేసుకుంటామని తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్…
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ (BCCI) షేర్ చేసింది. అందులో.. గిల్‌కు రిషబ్ పంత్ బౌలింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు ప్రాక్టీస్ సెషన్లో భాగంగా పంత్ బౌలింగ్ చేయడం కనిపించింది. కాగా.. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virat Kohli Name in Delhi Squad for Ranji Trophy 2024: అక్టోబర్ 11న రంజీ ట్రోఫీ 2024 ప్రారంభం కానుంది. ఢిల్లీ తన మొదటి మ్యాచ్‌ను చండీగఢ్‌తో ఆడనుంది. రంజీ ట్రోఫీ కోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) తన ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. 84 మంది ప్రాబబుల్స్ జాబితాలో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ ఢిల్లీ క్రికెటర్లే అన్న విషయం తెలిసిందే. పేసర్…
2022లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్.. దాదాపు రేండేళ్ల తర్వాత బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్‌ల్లో పునరాగమనం చేసినా.. అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసి పర్వాలేదనిపించినా.. రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయాడు. తనదైన శైలిలో బ్యాటింగ్ చేసి.. 13 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో (109) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే తన బ్యాటింగ్ సందర్భంగా బంగ్లాదేశ్…
అతని టెస్టు కెరీర్లో ఇది ఆరో సెంచరీ. అయితే.. తొలి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆట ప్రారంభానికి ముందు ఆయుధ పూజ చేశాడు. తన బ్యాట్, గ్లౌజులను టేబుల్ పై ఉంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగడం గమనార్హం. దీంతో.. పంత్ పూజలు ఫలించాయని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. అశ్విన్ గురించి తాను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదన్నాడు. వికెట్స్ అవసరమైన ప్రతిసారీ అతడివైపే చూస్తాం అని చెప్పాడు. బంతి లేదా బ్యాట్‌తో జట్టును ఆదుకునేందుకు ఎల్లప్పుడూ యాష్ సిద్ధంగా ఉంటాడని రోహిత్ తెలిపాడు. టీఎన్‌పీఎల్‌లో అశ్విన్ బ్యాటింగ్ చేయడం తాము చాలాసార్లు గమనించాం అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో యాష్ సెంచరీ…
India won by 280 Runs Against Bangladesh: చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 515 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన బంగ్లా.. రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంకు 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో రోహిత్ సేన 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (82) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్స్ పడగొట్టగా.. రవీంద్ర…