భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది. ఈరోజు మ్యాచ్ ప్రారంభం నుంచి సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ దూకుడుగా ఆడారు. మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా.. సెంచరీ సాధించి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు సర్ఫరాజ్.. మరోవైపు అతనికి తోడు రిషబ్ పంత్ కూడా ఈరోజు బ్యాటింగ్‌కు దిగుతాడో లేదో అన్న అనుమానం ఉండేది. కానీ.. ఈరోజు బ్యాటింగ్ కు దిగి అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ స్కోరును పరుగులు పెట్టించాడు. ఉదయం నుంచి ఇప్పటి వరకూ అద్భుతంగా ఆడిన ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్లు పెవిలియన్ బాట పట్టారు.
Read Also: Lanka Dinakar: 2047 స్వర్ణాంధ్ర సాధన చంద్రబాబు లక్ష్యం
అసలు విషయమేంటంటే.. సెంచరీ సాధిస్తాడని అనుకున్న రిషబ్ పంత్ జస్ట్‌లో మిస్ అయింది. 99 పరుగుల వద్ద ఔటై అభిమానులను నిరాశపరిచాడు. 105 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో రాణించాడు. అంతకుముందు.. 150 పరుగులు చేసి ఔటైన సర్ఫరాజ్ ఖాన్ కూడా.. డబుల్ సెంచరీ సాధిస్తాడని అనుకున్నారు. కానీ అతను కూడా 150 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఏదేమైనప్పటికీ భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అందరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత.. కోహ్లీ కూడా (70) పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 438/6గా ఉంది. టీమిండియా 82 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Read Also: Sarfaraz Khan: సర్ఫరాజ్ సెంచరీపై పలువురు క్రికెటర్లు ప్రశంసలు..