IND vs NZ: ఓటమి ఉచ్చులోనే భారత్.. ఈరోజు నిలబడితేనే..! ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే
- బెంగళూరు టెస్టులో ఎదురీదుతోన్న భారత్
- ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే
- పంత్ మైదానంలోకి దిగుతాడో లేదో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో 231/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయినా కూడా టీమిండియా ఇంకా ఓటమి ఉచ్చులోనే ఉంది. ప్రస్తుతానికి భారత్ ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటర్లు నాలుగోరోజైన శనివారం పూర్తిగా పోరాటాన్ని కొనసాగిస్తే తప్ప.. రోహిత్ సేన ఓటమి ఉచ్చులోంచి బయటికి రాదు. ఇప్పుడు భారం అంతా సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్‌లపైనే ఉంది. గాయపడిన రిషబ్ పంత్ మైదానంలోకి దిగుతాడో లేదో చూడాలి.
మూడోరోజు 180/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (134; 157 బంతుల్లో 13×4, 4×6) అద్భుత శతకం బాదాడు. పేసర్ టీమ్ సౌథీ (65; 73 బంతుల్లో 5×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/72), కుల్దీప్ యాదవ్ (3/99) చెరో మూడు వికెట్స్ పడగొట్టారు. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (52; 63 బంతుల్లో 8×4, 1×6), యశస్వి జైస్వాల్ (35; 52 బంతుల్లో 6×4) మంచి ఆరంభం ఇచ్చారు. అయితే ఈ ఇద్దరినీ స్పిన్నర్ అజాజ్ పటేల్ పెవిలియన్ చేర్చాడు.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
Also Read: T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో విండీస్‌పై విజయం.. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు న్యూజిలాండ్!
సర్ఫరాజ్ ఖాన్ (70 బ్యాటింగ్; 78 బంతుల్లో 7×4, 3×6) క్రీజులోకి రాగానే ధాటిగా ఆడాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70; 102 బంతుల్లో 8×4, 1×6) బాగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరు జట్టు స్కోరును 200 దాటించారు. దాంతో మరో వికెట్ కోల్పోకుండా భారత్ రోజును ముగించేలా కనిపించింది. కానీ ఆటలో చివరి బంతికి ఫిలిప్స్ బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్ ఇచ్చి ఇచ్చాడు. ఇది భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. నేడు ఎదురుదాడే మంత్రంగా ఆడితే భారత్ సక్సెస్ అవ్వొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!