IND vs NZ: టీమిండియాకు శుభవార్త.. నేడు బ్యాటింగ్‌కు పంత్!
- చివరి బంతికి కోహ్లీ అవుట్
- పంత్ మైదానంలోకి వస్తాడా?
- టీమ్ వర్గాలు ఏమన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Batting Today in Bengaluru: బెంగళూరు టెస్టులో నేడు నాలుగో రోజు. మూడో రోజైన శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ 231/3 స్కోర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైన రోహిత్ శర్మ (52; 63 బంతుల్లో 8×4, 1×6), విరాట్ కోహ్లీ (70; 102 బంతుల్లో 8×4, 1×6), సర్ఫరాజ్ ఖాన్ (70 బ్యాటింగ్; 78 బంతుల్లో 7×4, 3×6)లు జట్టును ఆదుకున్నారు. మూడో రోజు ఆటలో చివరి బంతికి కోహ్లీ అవుటయ్యాడు. దాంతో గాయపడిన రిషబ్ పంత్ నాలుగో రోజు బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వస్తాడా? లేదా? అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
2022 డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ మోకాలికి తీవ్ర గాయం అవ్వడంతో శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు బెంగళూరు టెస్టులో ఆ మోకాలికే గాయమైంది. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 37వ ఓవర్ చివరి బంతి తక్కువ ఎత్తులో వచ్చి అతడి కుడి మోకాలికి తగిలింది. ఫిజియో వచ్చి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మూడోరోజైన శుక్రవారం పంత్ వికెట్ కీపింగ్‌కు రాలేదు. అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా ధ్రువ్ జురెల్ కీపింగ్‌ను కొనసాగించాడు. విరాట్ కోహ్లీ ఔటైన నేపథ్యంలో శుక్రవారం ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సింది పంతే. గురువారం పంత్ బ్యాటింగ్ సాధన చేశాడు. మ్యాచ్‌లో విరామ సమయంలో మైదానంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దాంతో నేడు పంత్ బ్యాటింగ్ చేయడం ఖాయం అయింది. అంతేకాదు రిషబ్ నాలుగో రోజు బ్యాటింగ్ చేస్తాడని జట్టు వర్గాలు కూడా తెలిపాయి.
Also Read
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
Also Read: IND vs NZ: ఓటమి ఉచ్చులోనే భారత్.. ఈరోజు నిలబడితేనే..! ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే
రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. దూకుడుగా ఆడే అతడు కనీసం హాఫ్ సెంచరీ చేసినా.. జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సర్ఫరాజ్ ఖాన్ మంచి ఊపులో ఉన్నాడు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ కూడా బ్యాట్ జుళిపిస్తే.. భారత్ 125 పరుగుల లోటును పూడ్చుకోవడంతో పాటు 150-200 మధ్య ఆధిక్యం సంపాదించగలదు. నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యం 150 దాటినా ఛేదన అంత తేలిక కాకపోవచ్చు.
Rishabh is recovering well ❤️
– If he is feeling even 1 % of discomfort, he shouldn’t be come to bat
– No need to take any risk , because mega event BGT is coming #INDvNZ #RishabhPant #CricketTwitter pic.twitter.com/KRiIcxgUeu
— Harsh shekhawat (@wordofshekhawat) October 18, 2024
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!