పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏలో ఈరోజు (శుక్రవారం) ఉదయం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. కుడి మోచేతికి బంతి బలంగా తాకడంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియోథెరపిస్ట్ వచ్చి ప్రాథమిక చికిత్స చేయగా.. నొప్పి తగ్గకపోవడంతో మైదానాన్ని వీడాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ హ్యాట్రిక్ కొట్టనీయకుండా చూస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అంటున్నాడు. మైదానంలో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను నిశ్శబ్దంగా ఉంచడం పైనే తాము దృష్టిసారించాం అని తెలిపాడు. మమ్మద్ షమీ లేకపోవడం భారత జట్టుకు నష్టమేనని తెలిపాడు. భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకుంటామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందు కమిన్స్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. మైదానంలో టీమిండియా అభిమానులను నిశ్శబ్దంగా ఉంచుతాం అని చెప్పి…
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన భారత్.. ఇప్పుడు కీలక సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత రెండు సిరీస్‌లు గెలుచుకున్న టీమిండియా.. హ్యాట్రిక్‌పై కన్నేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై భారత్ ఐదు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలవాలి. కీలక సిరీస్ కాబట్టి భారత ఆటగాళ్లు ముందుగానే కంగారో గడ్డపై అడుగుపెడుతున్నారు. ఇప్పటికే బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లు ఆస్ట్రేలియా చేరుకున్నారు.…
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. సోమవారం (నవంబర్ 4)తో ఆటగాళ్ల నమోదు అధికారికంగా ముగియగా.. మొత్తం 1,574 మంది క్రికెటర్లు వేలం కోసం పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారతీయ క్రికెటర్స్ ఉండగా.. 409 మంది విదేశీయులు ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వేలంలో చాలా మంది టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరు మెగా వేలంలో భారీ ధర పలికే…
ఐపీఎల్ 2025 మెగా వేలం డేట్స్ వచ్చేశాయి. ఈ నెల 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. నవంబర్ 4తో ఆటగాళ్ల నమోదు ప్రక్రియ అధికారికంగా ముగిసింది. మొత్తం 1,574 మంది ప్లేయర్స్ వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. అంతకుముందు అక్టోబర్ 31న రిటెన్షన్ జాబితాకు గడువు ముగియగా.. 10 ప్రాంఛైజీలు తమ లిస్ట్ ప్రకటించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషబ్ పంత్‌ను వేలంలోకి వదిలేసింది. మేనేజ్‌మెంట్‌తో తలెత్తిన విభేదాల…
ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కోట్లను కొల్లగొట్టనున్నాడు. ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లలో రిషబ్ పంత్ లేడు. డబ్బుల విషయంలో ఢిల్లీ ఫ్రాంచైజీ యజమాని, పంత్ మధ్య ఎటువంటి ఒప్పందం జరగలేదని.. ఈ క్రమంలోనే పంత్‌ను ఢిల్లీ విడుదల చేసిందని చెబుతున్నారు. దీంతో.. వచ్చే సీజన్‌లో పంత్ కొత్త జట్టుకు ఆడబోతున్నాడు.. అతను ఏ జట్టుకు ఆడుతాడన్నది మెగా వేలంలో డిసైడ్ కానుంది.
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.. ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లు ఎంతో నిరాశపరిచారు. దీంతో.. వారి ప్రదర్శనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నెలలో భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌లో కూడా విఫలమైతే.. బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ క్రమంలో.. భారత కెప్టెన్ రోహిత్ శర్మపై కూడా చర్యలు తీసుకోనుంది. ఒకవేళ రోహిత్ శర్మ జట్టుకు దూరమైతే టెస్టు జట్టుకు…
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రిషబ్ పంత్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఫ్రాంచైజీ పంత్‌ను విడుదల చేయడంతో 2020 ఫైనలిస్ట్‌లతో పంత్ తొమ్మిదేళ్ల అనుబంధం ముగిసింది. కాగా.. ఢిల్లీ జట్టు రిటెన్షన్ లిస్ట్‌లో అక్షర్ పటేల్ మొదటి ఎంపికగా ఉన్నారు.
మొదటి రోజు డ్రెస్సింగ్ రూమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. రోహిత్ శర్మ రిషబ్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు.. ఏదో చెబుతున్నట్లు కనిపిస్తున్నాడు. వీడియోలో ఆ మూమెంట్ చూస్తే.. పంత్‌ను రోహిత్ శర్మ తిట్టినట్లుగా కనిపిస్తోంది. అయితే.. వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియదు కానీ.. రోహిత్ శర్మ రిషబ్ పంత్‌పై ఏదో విషయంలో కోపంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న మూడు టెస్టు, చివరి మ్యాచ్ కాస్త ఉత్కంఠ రేపుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌పై భారత్ 28 పరుగుల ఆధిక్యం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు రెండో రోజు మొదటి…