ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్ రిషబ్ పంత్.. ఆ ఫ్రాంచైజీని వీడనున్నట్లు తెలుస్తోంది.…
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ దుమ్ములేపాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన బ్యాటర్ల జాబితాలో మూడు స్థానాలు ఎగబాకి.. ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు. పంత్ ఖాతాలో ప్రస్తుతం 745 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో పంత్ 20, 99 పరుగులు చేశాడు.టెస్టు ర్యాంకింగ్స్‌లో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పంత్ అధిగమించాడు. ఒక స్థానం కిందకి పడిపోయిన విరాట్ (720)..…
ఇటీవల టెస్టుల్లో శ్రీలంక చేతిలో దారుణ ఓటములను ఎదుర్కొని భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన మొదటి టెస్టులో సంచలన ప్రదర్శనతో సొంతగడ్డపై వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియాకు షాక్ ఇచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ దిశగా దూసుకెళ్తున్న భారత జట్టుకు ఈ ఓటమి మింగుడుపడం లేదు. పూణే టెస్టులో గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగనుంది. ఇందుకోసం జట్టులో మార్పులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మార్పులు అనివార్యంగా…
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగుల వద్ద భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఔటయ్యాడు. దీంతో.. సెంచరీని మిస్ చేసుకున్నాడు. గత ఆరేళ్లలో పంత్ టెస్టుల్లో ఏడోసారి 90-99 రన్స్ మధ్య ఔటయ్యాడు. నాలుగో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి నాలుగో వికెట్ కు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి భారత్ ను కష్టాల నుంచి గట్టెక్కించాడు.
సెంచరీ సాధిస్తాడని అనుకున్న రిషబ్ పంత్ జస్ట్‌లో మిస్ అయింది. 99 పరుగుల వద్ద ఔటై అభిమానులను నిరాశపరిచాడు. 105 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో రాణించాడు. అంతకుముందు.. 150 పరుగులు చేసి ఔటైన సర్ఫరాజ్ ఖాన్ కూడా.. డబుల్ సెంచరీ సాధిస్తాడని అనుకున్నారు. కానీ అతను కూడా 150 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఏదేమైనప్పటికీ భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అందరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
Sarfaraz Khan Stopping Rishab Pant to not take Run: బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు మళ్లీ వర్షం అడ్డంకిగా మారింది. నాలుగో రోజైన శనివారం తొలి సెషన్ చివరలో వర్షం రావడంతో.. అంపైర్లు ఆటను నిలిపివేసి లంచ్ విరామాన్ని ప్రకటించారు. ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. ఇంకా 12 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్…
Rain in Bengaluru Chinnaswamy Stadium: బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ వర్షం కారణంగా నిలిచిపోయింది. భారత్ ఇన్నింగ్స్ 71 ఓవర్ ముగిసిన అనంతరం చిరు జల్లు రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియంలో చినుకులు పడుతున్నాయి. ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే.. మధ్యాహ్నం 12 గంటకు మ్యాచ్ తిరిగి ఆరంభం కానుంది. Also Read: Gold Rate Today: మగువలకు బ్యాడ్‌న్యూస్..…
Rishabh Pant Batting Today in Bengaluru: బెంగళూరు టెస్టులో నేడు నాలుగో రోజు. మూడో రోజైన శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ 231/3 స్కోర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైన రోహిత్ శర్మ (52; 63 బంతుల్లో 8×4, 1×6), విరాట్ కోహ్లీ (70; 102 బంతుల్లో 8×4, 1×6), సర్ఫరాజ్ ఖాన్ (70 బ్యాటింగ్; 78 బంతుల్లో 7×4, 3×6)లు జట్టును ఆదుకున్నారు. మూడో రోజు ఆటలో చివరి బంతికి కోహ్లీ అవుటయ్యాడు.…
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో 231/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయినా కూడా టీమిండియా ఇంకా ఓటమి ఉచ్చులోనే ఉంది. ప్రస్తుతానికి భారత్ ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటర్లు నాలుగోరోజైన శనివారం పూర్తిగా పోరాటాన్ని కొనసాగిస్తే తప్ప.. రోహిత్ సేన ఓటమి ఉచ్చులోంచి బయటికి రాదు. ఇప్పుడు భారం అంతా సర్ఫరాజ్…