కెప్టెన్ మార్ర్కమ్.. తమ బౌలర్లపై నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేశాడు. కేకేఆర్ కు గత రెండు మ్యాచ్ లలో విజయాలు అందించిన శార్థూల్ ఠాకూర్, రింకూ సింగ్ లను చూసి తామేమీ భయపడటం లేదని.. వాళ్లను కట్టడి చేసే వ్యూహాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి ఓవర్లో 5 వరుస సిక్సర్లు బాదిన రింకూ సింగ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఫినిషింగ్ లైన్‌పైకి తీసుకెళ్లిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ గత సీజన్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశాడు.
స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్ వీక్షించిన కేకేఆర్ కో-ఓనర్, బాలీవుడ్ సీనియర్ నటి జుహీ చావ్లా.. తమ జట్టు గెలవడంతో భావోద్వేగానికి లోనింది. విన్నింగ్ సెలబ్రెషన్స్ జరుపుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
కేకేఆర్ కు ఆశలే లేవు కానీ.. అనూహ్య విజయం సాధించిందంటే దానికి కారణం వెంకటేశ్ అయ్యర్ ఇన్సింగ్స్ తో పాటు రింకూ సింగ్ ది. చివరి ఓవర్ లో రింకూ సింగ్ ఐదు భారీ సిక్సులతో దుమ్మురేపాడు.
ఐపీఎల్ 16వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన విజయం సాధించింది. రింకూ సింగ్(48) ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. రింకూ సింగ్ సిక్సర్ల మోత మోగించడంతో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.