Rinku Singh I am happy to get the Man of the Match award in my first game: ఐపీఎల్ స్టార్, టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. ఐర్లాండ్‌తో తొలి టీ20లోనే రింకూ అరంగేట్రం చేసినా.. ఆ మ్యాచ్‌లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో టీ20లో ఆడిన రింకూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రింకూ.. చివరి 5 బంతుల్లో 4, 6, 6, 1, 6 బాది జట్టుకు భారీ స్కోర్ అందించాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన రింకూకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అవార్డు దక్కడం సంతోషంగా ఉందని అతడు తెలిపాడు.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు తీసుకున్నాక రింకూ సింగ్ మాట్లాడుతూ… ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐపీఎల్‌లో నేనేం చేశానో అదే ఫాలో అయ్యా. ఐపీఎల్‌లో ఒత్తిడి సమయంలో ఆడడం నాకు కలిసొచ్చింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాను. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాను. కెప్టెన్ ఏం చెబితే అదే చేశా. పదేళ్లుగా క్రికెట్ ఆడుతుంటే.. ఇప్పుడే దానికి తగిన ప్రతిఫలం దక్కింది. కనీసం పదేళ్లు భారత జట్టు కోసం ఆడాలన్నది నా లక్ష్యం. నేను బ్యాటింగ్ చేసిన తొలి మ్యాచ్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కడం సంతోషంగా ఉంది’ అని తెలిపాడు.
ఐపీఎల్ 2023లో 14 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్ 149.9 స్ట్రైక్‌రేట్‌తో 474 పరుగులు చేశాడు. ఓ మ్యాచ్‌లో అయితే చివరి ఓవర్లో ఏకంగా 5 సిక్సులు బాదాడు. దాంతో రింకూకు బీసీసీఐ సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. ఐర్లాండ్ సిరీస్ సహా చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలకు కూడా రింకూను సెలక్టర్లు ఎంపిక చేశారు. తనకు వచ్చిన అవకాశాన్ని రింకూ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే.. జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటాడు.
Also Read: IND vs IRE: అదే పెద్ద తలనొప్పిగా మారింది: జస్ప్రీత్ బుమ్రా
ఇక రెండో టీ20లో 33 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో మరో టీ20 మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో బుమ్రా సేన కైవసం చేసుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో మ్యాచ్ బుధవారం జరుగుతుంది. ఈ మ్యాచులో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది.