Asian Games 2023: భారత క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్.. ఎవరూ ఊహించరు! టీ20 టీమ్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruturaj Gaikwad is New Team India Captain for Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఆసియా క్రీడలు 2023 (ఏషియన్ గేమ్స్ 2023) కోసం భారత పురుషుల టీ20 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ద్వితీయ శ్రేణి జట్టును శుక్రవారం బీసీసీఐ ప్రకటించింది. ఆసియా క్రీడల కోసం వెళ్లే భారత జట్టుకు యువ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనున్నాడు. ఐపీఎల్‌లో సత్తాచాటిన అందరికీ జట్టులో చోటు దక్కింది. ఇక సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి.
ఏషియన్ గేమ్స్ 2023 కోసం ఎంపిక చేసే జట్టుకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్సీ చేయనున్నాడని ముందునుంచి వార్తలు వచ్చాయి. అయితే బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం అతడికి షాక్ ఇస్తూ.. పూర్తిగా యువ ఆటగాళ్లనే ఎంచుకుంది. ఎవరూ ఊహించని విధంగా రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్ చేశారు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు జట్టులో చోటు దక్కింది. ఐపీఎల్ స్టార్ రింకు సింగ్ తొలిసారిగా జట్టులో చోటు సంపాదించాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ కీపర్‌గా ఎంపికయ్యాడు.
Also Read
Also Read: WI vs IND: అశ్విన్ స్పిన్ మాయాజాలం.. తొలి టెస్టులో భారత్‌కు ఇన్నింగ్స్ విజయం!
ఆసియా క్రీడలు 2023లో పురుషుల ఆట సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో భారత్‌లో అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ 2023 జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత పురుషుల ద్వితీయ శ్రేణి జట్టు ఏషియన్ గేమ్స్ 2023 పాల్గొంటుంది. 2010, 2014 ఆసియా క్రీడల్లో క్రికెట్ ఉన్నా భారత్ మాత్రం పాల్గొనలేదు. ఇప్పుడు భారత ఒలింపిక్ సంఘం ఒత్తిడి తేవడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత టీ20 జట్టు (India T20 squad for Asian Games 2023):
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబె, ప్రభ్‌సిమ్రన్ సింగ్.
స్టాండ్‌బైలు:
యశ్ ఠాకూర్, సాయికిశోర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, సాయిసుదర్శన్.
Also Read: Today Gold Price: స్థిరంగా బంగారం ధరలు.. భారీగా పెరిగిన వెండి!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు