ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన రింకూ సింగ్.. ఎట్టకేలకు టీమిండియాలో స్థానం సంపాదించుకోగలిగాడు. భారత్ తరఫున ఆడాలనే తన కల నెరవేరేలా కనిపిస్తోందంటూ రింకూ.. భావోద్వేగానికి గురయ్యాడు. రెండు రోజుల క్రితమే ఆసియా క్రీడలకు జట్టును ప్రకటించగా.. అందులో రింకూ పేరు ఉంది. దీంతో రింకూ మాట్లాడుతూ.. తన కల నిజమైందని తెలిపాడు.
Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆనందంలో డార్లింగ్ ఫ్యాన్స్.. ?
టీమ్ లో తన పేరును ప్రకటించగానే.. ఇప్పటివరకు తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు రింకూ సింగ్. అనంతరం భావోద్వేగానికి గురైన రింకూ.. ఈ సమయంలో ఏమీ మాట్లాడాలో తనకు తెలియడం లేదన్నాడు. అంతేకాకుండా తను.. ఎమోషనల్ పర్సన్ అని, పేరెంట్స్ తో మాట్లాడినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకుంటానని చెప్పాడు. మరోవైపు
ఐపీఎల్-2023లో.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి ఓవర్‌లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి కోల్‌కతాకు రింకూ విజయం అందిచాడు. దాంతో రింకూ జీవితం అక్కడ నుండి మారిపోయింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందాడు.
Road Accident : 2 బస్సులు ఢీ..30 మందికి తీవ్రగాయాలు..
మరోవైపు రింకూసింగ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాను పడిన కష్టానికి ఫలితం దక్కిందని తెలిపాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆరేళ్లుగా కొనసాగుతున్నానని.. మొదట్లో అవకాశాలు వచ్చినా ఫెయిల్ అయినట్లు చెప్పుకొచ్చాడు. అయితే కెరీర్ ప్రారంభంలో తాను చాలా నేర్చుకున్నానని.. ముంబైలో అభిషేక్ నాయర్‌తో కలిసి బ్యాటింగ్‌లో పనిచేసినట్లు తెలిపాడు. అయితే తాను పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తోందని రింకూ పేర్కొన్నాడు. అంతేకాకుండా తాను ఇంతవరకు ఎదగడం పట్ల తన ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు తెలిపాడు. కోల్‌కతా ఫ్రాంచైజీ తనలోని సామర్థ్యాన్ని చూసి మద్దతు తెలిపిందన్నాడు. తను నెట్స్‌లో ప్రతిరోజూ 5-6 గంటల పాటు బ్యాటింగ్ చేసేవాడని.. దాని వల్ల ఆల్‌రౌండ్ బ్యాట్స్‌మెన్ అయ్యానని, ఐపిఎల్‌లో బాగా రాణించినట్లు చెప్పుకొచ్చాడు.