Rinku Singh: అక్కడుంది రింకూ సింగ్.. ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా బాదుడు మాత్రం సేమ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL star Rinku Singh Hits 3 Sixes in Debut T20: ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను అద్భుతంగా ఆరంభించాడు. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన రింకూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తనదైన శైలిలో సిక్సర్లు బాది అభిమానులను అలరించాడు. రెండో టీ20లో రింకూ 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో మొదటిసారి బ్యాటింగ్ చేసినా కూడా రింకూలో ఎలాంటి బెరుకు కనిపించలేదు.
రెండో టీ20లో రింకూ సింగ్ తొలి 16 బంతుల్లో ఓ బౌండరీ సాయంతో 15 పరుగులే చేశాడు. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో రింకూ క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. అయితే చివరి 5 బంతుల్లో 4, 6, 6, 1, 6 బాది 23 పరుగులు పిండుకున్నాడు. ఐపీఎల్ 2023లో చెలరేగినట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా రెచ్చిపోయాడు. ప్రస్తుతం రింకూ సింగ్ సిక్సర్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రింకూ షాట్స్ చూసిన ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ‘అక్కడుంది రింకూ సింగ్’, ‘ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా రింకూ బాదుడు మాత్రం సేమ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
Also Read: Asia Cup 2023: ఆసియా కప్ 2023కి ముందు నిప్పులపై నడిచిన క్రికెటర్.. ఎందుకో తెలుసా?
ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టీ20 సిరీస్‌ని మరో మ్యాచ్ మిగిలుండగానే బుమ్రా సేన కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (58; 43 బంతుల్లో 6×4, 1×6), సంజు శాంసన్ (40; 26 బంతుల్లో 5×4, 1×6) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఆండీ బాల్‌బిర్నీ (72; 51 బంతుల్లో 5×4, 4×6) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు.
RINKU SINGH IS HERE….!!!
What an outstanding innings by Rinku in debut innings – he's made it and showed everyone what he's capable of, what a talent, the future! pic.twitter.com/Cv51juVXwc
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 20, 2023
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!