Scott Styris: అతడు ఆల్‌రౌండర్ కాదు, అరకొర ఆటగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scott Styris Comments On Shardul Thakur: ఎవరైనా ఒక క్రికెటర్ సరిగ్గా ప్రదర్శించకపోతే.. అతనిపై మాజీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. ఆ ఆటగాళ్ల గత ట్రాక్ రికార్డులను చూడకుండా, కేవలం పేలవ పెర్ఫార్మెన్స్ ఆధారంగా.. వాళ్లు ఆటగాళ్లే కాదని, అలాంటి వాళ్లను జట్టులోకే తీసుకోకూడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. రీసెంట్‌గానే రోహిత్ శర్మపై కృష్ణమచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! అతడు తన పేరుని నోహిట్‌గా మార్చుకోవాలని, తాను ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయితే రోహిత్‌ని జట్టులోకే తీసుకోనని కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడు టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌పై న్యూజీలాండ్ మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. శార్దూల్‌ని ఆల్‌రౌండర్ కాదని, అరకొర ఆటగాడని బాంబ్ పేల్చాడు.
Kauri Darden Richins: భర్తని చంపింది.. అతనిపై పుస్తకం రాసింది.. చివరికి అలా దొరికింది
Also Read
- Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
- Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!

చెపాక్ వేదికగా ఆదివారం సీఎస్‌కే- కేకేఆర్ మ్యాచ్ ఆరంభానికి ముందు స్టైరిస్ మాట్లాడుతూ.. ‘‘శార్దూల్ ఠాకూర్ అసలు ఒక క్రికెటర్‌లాగే అనిపించడం లేదు. అతడిని ఆల్‌కరౌండర్ అనడం కంటే అరకొర ఆటగాడు అని పిలవడం మంచిది’’ అంటూ పేర్కొన్నాడు. అంటే.. ఎప్పుడో ఒకసారి మాత్రమే బాగా రాణిస్తాడని, నిలకడగా ప్రదర్శించట్లేదని అభిప్రాయపడ్డాడు. అవును.. శార్దూల్ ఈ సీజన్‌లో సరిగ్గా ప్రదర్శించలేదన్న మాట వాస్తవమే! 9 ఇన్నింగ్స్‌లో 110 పరుగులు మాత్రమే చేసిన ఇతగాడు, బౌలర్‌గానూ స్థాయికి తగ్గ రాణించలేదు. ఈ సీజన్‌లో 5 వికెట్లే పడగొట్టాడు. కేకేఆర్ తనపై వెచ్చించిన రూ.10.75 కోట్లకు అతడు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నాడు. కానీ.. గతంలో ఇతడు ఎన్నోసార్లు సింగిల్ హ్యాండెడ్‌గానే రాణించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా.. లీగ్ మ్యాచ్‌ల్లో కన్నా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో శార్దూల్ తన ఆల్‌రౌండర్ ప్రదర్శనతో చాలాసార్లు టీమిండియాను ఆదుకున్నాడు. అందుకే.. అతడ్ని ‘లార్డ్ శార్దూల్’ అని అభిమానులు పిలుచుకుంటుంటారు.
Vaishnav Tej: ‘రుద్ర కాళేశ్వర రెడ్డి’గా మారిన మెగా మేనల్లుడు… మాములుగా లేడుగా
ప్రతి ఆటగాడికీ ఏదో ఒక సమయంలో బ్యాడ్ ఫేజ్ వస్తుంది. హేమాహేమీలు సైతం తంటాలు పడిన సందర్భాలు ఉన్నాయి. ఆమాత్రం దానికే వారిని ఆటగాడు కాదని వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదు. అందుకే.. స్టైరిస్ వ్యాఖ్యలపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. కాగా.. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే! సీఎస్కే నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 18.3 ఓవర్లలోనే ఛేధించింది. టాపార్డర్ కుప్పకూలగా.. నితీశ్ రానా, రింకూ సింగ్ అర్ధ శతకాలతో కదం తొక్కి, తమ జట్టుకి విజయం అందించారు.
తాజావార్తలు
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!