ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ టూర్ లో బిజీగా బిజీగా గడుపుతోంది. ఈనెల 12 నుంచి రెండు టెస్టుల సిరీస్‌లో విండీస్ తో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ అనంతరం మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కూడా ఆడనుంది. ఆగస్టు 3 నుంచి 14 వరకు ఐదు టీ20ల సిరీస్ జరుగనుంది. ట్రినిడాడ్, గయానా, ఫ్లోరిడా వేదికలుగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మేరకు మూడు ఫార్మాట్లకు సంబంధించిన జట్లను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన రింకూ సింగ్‌కు భారత జట్టులో స్థానం దక్కకపోవడంతో బీసీసీఐపై విమర్శల వర్షం కురుస్తోంది.
Read Also: Ponnam Prabhakar: బీజేపీ డ్యామేజ్‌ని కంట్రోల్ చేసుకునేందుకే మోడీ పర్యటన
వెస్టిండీస్‌తో తలపడే టీ20 సిరీస్‌లో కొందరు ఐపీఎల్ స్టార్లకు ప్లేస్ దక్కింది. రాజస్థాన్ రాయల్స్ తరఫున అదరగొట్టిన యశస్వీ జైస్వాల్, ముంబై ఇండియన్స్ తరఫున రాణించిన తిలక్ వర్మకు కూడా తొలిసారి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. యశస్వీ జైస్వాల్ కు మూడు ఫార్మాట్లలోనూ స్థానం దక్కించుకున్నాడు. అయితే రింకూ సింగ్‌ను బీసీసీఐ పట్టించుకోకపోవడంతో విమర్శల పర్వం మొదలైంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో వీరోచిత ఇన్నింగ్స్‌లు ఆడిన 25 ఏళ్ల రింకూ సింగ్ భారత జట్టులో స్థానం సంపాదిస్తాడని అందరూ అనుకున్నారు.. కానీ అది జరగలేదు. అతడిని కావాలనే జట్టులోకి తీసుకోలేదని సెలెక్టర్లపై మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో బీసీసీఐ బహిరంగంగా విమర్శల దాడి చేశారు.
Read Also: Vijay: విజయ్ అతని ఫ్యాన్స్ తో నన్ను బూతులు తిట్టిస్తున్నాడు.. రాజేశ్వరి ప్రియ సంచలన వ్యాఖ్యలు
అయితే యంగ్ క్రికెటర్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ రింకూ సింగ్‌ను వెస్టిండీస్ సిరీస్‌కు తీసుకోకపోవడంపై బీసీసీఐకి చెందిన ఓ అధికారి రియాక్ట్ అయ్యారు. అతడిని వచ్చే నెలలో జరిగే ఐర్లాండ్ లో జరుగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడతాడని.. అందుకే విండీస్ టూర్‌కు ఎంపిక చేయలేదని చెప్పాడు. ఆగస్టు 14న వెస్టిండీస్ పర్యటన ముగిసిన వెంటనే ఆగస్టు 18 నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా ఆడనుంది. దీంతో ఐర్లాండ్ టూర్‌కు యంగ్ ప్లేయర్స్ ను బీసీసీఐ పంపనుంది. ఈ సిరీస్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ కు జితేష్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాళ్లకు కూడా అవకాశం దక్కనుంది.