గత యేడాది లాగే ఈ సారి కూడా లాక్ డౌన్ సినిమా రంగాన్ని కుదేలు చేసింది. అయినా కొన్ని సినిమాలు వెలుగులు విరజిమ్మాయి. మరికొన్ని ఓటీటీల్లో సందడి చేశాయి. ఇంకొన్ని బాక్సాఫీస్ బరిలో మిశ్రమ ఫలితాలు చూశాయి. అందరు స్టార్ హీరోస్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దూకలేకపోయాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం దాదాపు టాలీవుడ్ లో స్టార్ హీరోస్ అనిపించుకున్నవారందరూ ఏదో విధంగా వినోదం పంచారనే చెప్పాలి. టాప్ హీరోస్ లో కొందరి సినిమాలు థియేటర్లలో…
కరోనా ఫస్ట్ వేవ్ తో గత యేడాది, సెకండ్ వేవ్ తో ఈ సంవత్సరం సినిమా రంగానికి గట్టి పరీక్షనే పెట్టాయి. అయితే… యువ కథానాయకులు మాత్రం ఏదో ఒక స్థాయిలో బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతారని అంతా అనుకున్నారు. కానీ తెలుగు ప్రేక్షకుల అంచనాలను తల్లకిందులు చూస్తే, మన యంగ్ హీరోస్ ఈ యేడాది భారీ పరాజయాలను తమ ఖాతాలో జమ చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’…
2021లో దాదాపు 270 తెలుగు సినిమాలు విడుదలైతే అందులో స్ట్రయిట్ మూవీస్ సుమారు 200. థియేటర్లలో కాకుండా ఇందులో ఇరవైకు పైగా సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యాయి. విశేషం ఏమంటే యంగ్ హీరోస్ తో పాటు స్టార్ హీరోలనూ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొత్త దర్శకులకు ఈ యేడాది లభించింది. మరి ఈ నయా దర్శకులలో ఎవరెవరు తమ సత్తా చాటారో తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున నటించిన ఒకే ఒక్క చిత్రం ‘వైల్డ్ డాగ్’…
ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే టిక్‌టాక్ యాప్ ఎంతగానో పాపులర్ అయ్యింది. లాక్‌డౌన్‌లో ఈ యాప్‌ను తెగవాడేశారు. కొన్ని కోట్ల వీడియోలను ఈ యాప్ ద్వారా యూజర్లు అప్‌లోడ్ చేశారు. అయితే ఈ యాప్ వల్ల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిషేధించింది. అయినా ఈ ఏడాది టిక్‌టాక్ యాప్ మోస్ట్ పాపులర్ యాప్‌గా నిలిచింది. ఈ విషయాన్ని ఐటీ సెక్యూరిటీ కంపెనీ క్లౌడ్ ఫ్లేర్ ప్రకటించింది. Read Also: మొబైల్ రీఛార్జ్…
తెలుగు సినిమా దాదాపు నాలుగు దశాబ్దాల నుంచీ ప్రతి యేటా 30 శాతం మించి విజయాలను చూడలేకపోతోంది. ప్రతి సంవత్సరం టాలీవుడ్ విజయశాతం 15 నుండి 30 మాత్రమే ఉంటోంది. ఈ యేడాది లాక్ డౌన్ కారణంగా మే, జూన్ మాసాల్లో సినిమా థియేటర్లు మూతపడడంతో ఆ శాతం మరింత తగ్గిందనే చెప్పాలి. 2021 సంవత్సరంలో 203 స్ట్రెయిట్ మూవీస్, 64 డబ్బింగ్ సినిమాలు జనం ముందుకు వచ్చాయి. అంటే దాదాపు 270 చిత్రాలు వెలుగు చూశాయన్న…
2021 ఏడాది మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ తర్వాత ప్రజలు ఎక్కువ చర్చించుకున్నది… ఇబ్బంది పడింది పెట్రోల్ ధరల విషయంలోనే. ఎందుకంటే దేశంలో ఈ ఏడాది లీటర్ పెట్రోల్ ధర తొలిసారిగా రూ.100 దాటింది. ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇది రూ.100పైనే ఉంది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకు దేశీయ సుంకాలు తోడవడంతో సామాన్యుడు పెట్రోల్ ధరల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర…
పరభాషా నాయికల కోసం టాలీవుడ్ డోర్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో కన్నడ భామలు అత్యధికంగా తెలుగు చిత్రసీమలోకి వచ్చారు. అయితే ఆ జోరు ఇప్పుడు కాస్తంత తగ్గింది. కానీ చిత్రంగా ఈ యేడాది శాండిల్ వుడ్ బ్యూటీ కృతీశెట్టి అత్యధిక అవకాశాలు అందుకుని, నయా హీరోయిన్స్ జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఓవర్ ఆల్ గా చూసినప్పుడు ఈ యేడాది పరభాష భామల ఎంట్రీ కూడా బాగానే వుంది. ‘ఉప్పెన’తో…
గత యేడాది మాదిరిగానే పలువురు సినీ ప్రముఖులు ఈ సంవత్సరం కూడా కరోనా కారణంగా కన్నుమూశారు. అదే సమయంలో అనారోగ్యం కారణంగానూ మరికొందరు దివికేగారు. ప్రముఖ సినీ మాటల, పాటల రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ (64) జనవరి 5వ తేదీ గుండెపోటుతో చెన్నయ్ లో కన్నుమూశారు. 1986లో ‘శ్రీరామచంద్రుడు’తో గీత రచయితగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన వెన్నెల కంటి మూడు వందలకు పైగా చిత్రాలలో దాదాపు మూడు వేల పాటలు రాశారు. ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దొరస్వామిరాజు…