ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే టిక్‌టాక్ యాప్ ఎంతగానో పాపులర్ అయ్యింది. లాక్‌డౌన్‌లో ఈ యాప్‌ను తెగవాడేశారు. కొన్ని కోట్ల వీడియోలను ఈ యాప్ ద్వారా యూజర్లు అప్‌లోడ్ చేశారు. అయితే ఈ యాప్ వల్ల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నిషేధించింది. అయినా ఈ ఏడాది టిక్‌టాక్ యాప్ మోస్ట్ పాపులర్ యాప్‌గా నిలిచింది. ఈ విషయాన్ని ఐటీ సెక్యూరిటీ కంపెనీ క్లౌడ్ ఫ్లేర్ ప్రకటించింది.
Read Also: మొబైల్ రీఛార్జ్ కోసం 28 రోజుల వ్యాలిడిటీనే ఎందుకు?
ర్యాంకుల పరంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో టిక్ టాక్ యాప్ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నట్లు క్లౌడ్ ఫ్లేర్ వెల్లడించింది. మార్చి, జూన్ నెలల్లోనూ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. తిరిగి ఆగస్ట్ నుంచి హిట్స్ పరంగా మొదటి స్థానంలో ఉంటూ వస్తోందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా టిక్‌టాక్ యాప్‌కు 100 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. అటు టాప్-10లో టిక్‌టాక్ తర్వాతి స్థానాల్లో గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ ఉన్నాయి. కాగా గత ఏడాది హిట్స్ పరంగా గూగుల్ తొలి స్థానంలో నిలిచింది. టిక్ టాక్, అమెజాన్, యాపిల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్ వంటి యాప్‌లు గత ఏడాది టాప్ 10లో స్థానం సంపాదించాయి.