తెలంగాణలో ఈరోజు నుంచి లాక్‌డౌన్ అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కు కొన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చారు. వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఫార్మా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల కార్మికులకు ఇబ్బంది ఉండదని, ఆయా కంపెనీల ఐడీ కార్డులను చూపిస్తే అనుమతి ఇస్తామని డీజీపి మహెందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని డిజీపీ తెలిపారు. ప్రజలు అనవసరంగా రోడ్లమీదకు వచ్చి ఇబ్బందులు పడోద్దని,…
ఈ మధ్యకాలంలో విడుదలకు ముందే… మ్యూజిక్ తో మెస్మరైజ్ చేసిన మూవీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ‘నీలీ నీలీ ఆకాశం’ పాట ఇలా విడుదలైందో లేదో… అలా జనంలోకి వెళ్ళిపోయింది. సాంగ్ రిలీజ్ అయ్యి యేడాది గడిచే సరికీ… త్రీ హండ్రెస్ ప్లస్ మిలియన్ వ్యూస్ ను ఈ పాట దక్కించుకుందంటే… ఏ స్థాయిలో అది హిట్ అయ్యిందో ఊహించుకోవచ్చు… దాంతో సహజంగానే మూవీ మీద అంచనాలూ భారీగా పెరిగిపోయాయి. పైగా ఈ వీకెండ్ విడుదలైన…
ప్రతి శుక్రవారం ఏదో ఒక కొత్త సినిమాతో తన వ్యూవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఆహా! తాజాగా అలా ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా ‘నారింజ మిఠాయి’. 2019 డిసెంబర్ లో ‘సిల్లు కరుప్పత్తి’ అనే తమిళ మూవీ రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత అది నెట్ ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అయ్యింది. దాని తెలుగు వర్షనే ‘నారంజ మిఠాయి’. సహజంగా ఆంథాలజీ అనగానే ఎన్ని భాగాలు ఉంటే… అంతమంది దర్శకత్వం చేయడం మనం చూస్తున్నాం.…
మెగా ఫ్యామిలీ నుండి ఓ కొత్త హీరో వస్తున్నాడంటే భారీ అంచనాలు ఏర్పడటం సహజం. అది ‘ఉప్పెన’ విషయంలో భారీ నుండి అతి భారీకి చేరుకుంది. కారణం దానిని నిర్మిస్తోంది ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కావడం, దర్శకత్వం వహించిన సానా బుచ్చిబాబు ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కావడం! అలానే బాల నటుడిగా చేసింది రెండు మూడు సినిమాలే అయినా క్యూట్ గా ఉండే వైష్ణవ్ ఫస్ట్ టైమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం,…
పేరుకు ముందు తొలి చిత్రం పేరు ‘అల్లరి’ని ఏ ముహూర్తాన పెట్టుకున్నాడో కానీ నరేశ్ కు అన్నీ అల్లరి చిల్లరి వినోదాత్మక చిత్రాలే వచ్చాయి. ఇంతవరకూ నరేశ్ నటించిన 57 సినిమాల్లో పై ఏడు సినిమాల్లో కొంత భిన్నమైన పాత్రలను నరేశ్ చేశాడనిపిస్తుంది. ఆ కోవలో వచ్చిన మరో చిత్రం ‘నాంది’. కామెడీ హీరోగా ముద్ర పడిన నరేశ్ లోకి నటుడిని వెలికి తీసిన చిత్రాల సరసన ‘నాంది’ సైతం నిలబడుతుంది. విజయ్ కనకమేడల ను దర్శకుడిగా…
కొన్ని రీమేక్స్ జోలికి పోకపోతే మంచింది. పైగా కన్నడ రీమేక్స్ ను టేకప్ చేయడం అంత రిస్క్ మరొకటి ఉండదు. అక్కడ విజయం సాధించిన చాలా చిత్రాల తెలుగు రీమేక్స్ లో పరాజయాల శాతమే ఎక్కువ. దానికి బోలెడు ఉదాహరణలున్నాయి. ఇక తాజాగా ‘కావలదారి’ కన్నడ చిత్రం రీమేక్ గా తెలుగులో ‘కపటధారి’గా రీమేక్ అయ్యింది. ఎలా ఉందో తెలుసుకుందాం. 1977వ సంవత్సరం వరంగల్ సమీపంలో జరిపిన తవ్వకాలలో ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారికి కాకతీయుల కాలం…
ఈ యేడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘క్రాక్’ మూవీ ఫిబ్రవరి 5న ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఆ కమర్షియల్ హిట్ మూవీని స్ట్రీమింగ్ చేసిన సందర్భంగా గత శుక్రవారం గ్యాప్ ఇచ్చిన ఆహా ఓటీటీ సంస్థ ఈ ఫ్రై డే మలయాళ చిత్రం ‘అంజామ్ పాతిర’ను తెలుగు వారి ముందుకు తీసుకొచ్చింది. గత యేడాది జనవరి 10న విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కేరళలో ఘన విజయం సాధించింది. దీనిని తెలుగులో వి. రామకృష్ణ ‘మిడ్…
అటు హిందీలోనూ, ఇటు తమిళంలోనూ ఓటీటీలలో వస్తున్న ఆంథాలజీలను చూసి… తెలుగువాళ్ళు సైతం అలాంటి వాటిని తీయగలరు అని నిరూపించడానికి నలుగురు ప్రముఖ తెలుగు దర్శకులు నడుంకట్టారు. నిజానికి వాళ్ళను అందుకు ప్రేరేపించింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ అనుకోవచ్చు. బడ్జెట్ పరమైన పరిమితులు కూడా బహుశా పెద్దంతగా ఉండి ఉండకపోవచ్చు. దాంతో ఉన్నంతలో ఈ ఆంధాలజీని కాస్తంత గ్రాండ్ గా తీసే ప్రయత్నం చేశారు. ఇది అభినందించదగ్గదే. కానీ పేరున్న ఈ నలుగురు దర్శకులు…
ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ గత యేడాది డిసెంబర్ 25న ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని విడుదల చేశారు. ఇంతవరకూ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలను నిర్మించిన ఆయన బ్యానర్ నుండి వచ్చిన కాస్తంత డిఫరెంట్ మూవీ ‘నిన్నిలా నిన్నిలా’. పలు తమిళ చిత్రాలతో పాటు తాజాగా మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన హీరో అశోక్ సెల్వన్ కు ఇది తొలి తెలుగు సినిమా. ఇక బబ్లీ గర్ల్స్ నిత్యామీనన్, రీతూ వర్మ ఇందులో హీరోయిన్లుగా నటించారు. దివంగత…
‘చక్రవాకం’, ‘మొగలి రేకులు’ సీరియల్స్ తో ప్రతి తెలుగువారి ఇంటిలోనూ ఓ సభ్యుడిగా మారిపోయాడు ఆర్.కె. నాయుడు ఉరఫ్ సాగర్. టీవీ నటుడిగా లభించిన ఆదరణతో ‘సిద్ధార్థ’ అనే చిత్రంలో సోలో హీరోగా నటించాడు. ఆశించిన విజయం లభించలేదు. మరోసారి తన అదృష్టాన్ని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మూవీతో పరీక్షించుకున్నాడు. అదీ గొప్ప ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా పట్టు వదలకుండా ఇప్పుడు ‘షాదీ ముబారక్’ అంటూ జనం ముందుకు వచ్చాడు. మరి ఈసారి ఎలాంటి ఫలితం…