Ponguleti Srinivasa Reddy: సమాచార శాఖపై మంత్రి పొంగులేటి సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇవాళ డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమాచార శాఖ పని తీరును సంబంధిత అధికారులతో సమీక్షీంచారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలను చైతన్య వంతులను చేయడంలో సాంప్రదాయ ప్రచార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వింగ్ ను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. తెలంగాణ మాస పత్రికను మరింత ప్రామాణికమైన పత్రికగా తీర్చి దిద్దడంతో పాటు ఈ పత్రికను రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, ప్రజా ప్రతినిధులకు, సామాన్య ప్రజానీకానికి అందుబాటులో తీసుకు రావాలని చెప్పారు.
Read Also: Jeevan Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయింది..!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఈ సందర్బంగా సమాచార శాఖలో వివిధ విభాగాల పని తీరును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. ప్రింట్ మీడియా, ప్రింట్ మీడియా, అవుట్ డోర్ విభాగం చేపట్టిన కార్యక్రమాలపై ఆయన మీటింగ్ నిర్వహించారు. జర్నలిస్టుల సంక్షేమం, క్షేత్ర స్థాయిలో ప్రచార నిర్వహణపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సమాచార శాఖ పని తీరును మెరుగు పర్చాలని అధికారులను ఆదేశించారు. సమాచార శాఖతో పాటు మీడియా అకాడమీ చేపట్టిన కార్యక్రమాలపై సమాచార కమీషనర్ అశోక్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్లు మధు సూధన్, హాష్మి, రాజా రెడ్డి, సురేష్ , చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ రాధా కిషన్, ప్రాంతీయ సమాచార ఇంజనీర్ జయరామ్ మూర్తి, రాములు, అకౌంట్స్ ఆఫీసర్ పద్మ కుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?