రైతుల విషయంలో కేసీఆర్ ఏం చేస్తారో చూద్దాం అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పంటకు కనీస మద్దతు ధర కల్పించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. రాబోయే 2023-2024 ఆర్థిక సంవత్సరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉండే అవకాశం లేదు. హరీష్ రావు ప్రవేశ పెట్టిన బడ్జెట్ చివరి బడ్జెట్ అవుతుందన్నారు. చివరికి రుణమాఫీ కంటే వడ్డీ మాఫీ కార్యక్రమంగా నేను భావిస్తున్నా అన్నారు. కేంద్రంపై ఎంత ఒత్తిడి చేస్తారో చేయండి అన్నారు జీవన్…
టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి చెక్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన అదనపు బాధ్యతల్లో కోత విధించింది. ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది టీపీసీసీ. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు అప్పగించిన పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తప్పించింది టీపీసీసీ. ఆయనకు గతంలో ఉన్న బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది. జగ్గారెడ్డి కి అప్పగించిన బాధ్యతల్లో……
ఎల్లారెడ్డి బహిరంగ సభకు భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు, జనం. దారి పొడవునా రేవంత్ రెడ్డికి భారీ స్వాగతాలు లభించాయి. గ్రామాలలో, పట్టణాలలో రోడ్డుకు ఇరువైపులా రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికారు ప్రజలు. భారీ గజ పూల మాలలతో, మంగళ హారతులు, తిలకాలు దిద్దారు. రేవంత్ రెడ్డికి స్వాగతం చెప్పారు. ఎల్లారెడ్డి ఆర్టీసీ గ్రౌండ్ లో మన ఊరు, మన పోరు బహిరంగ సభ జరుగుతోంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కి మన ఊరు మన…
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆకస్మిక మరణం పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మల్లు స్వరాజ్యం మరణంతో ఆసుపత్రికి చేరుకున్నారు సీపీఎం నేత, మాజీ ఎంపీ మధు. ఆమె మరణానికి తీవ్ర సంతాపం తెలిపారు. స్వరాజ్యం మరణం తీరని లోటు. భూస్వామ్యక కుటుంబంలో పుట్టిన పోరాట యోధురాలుగానే ఆమె నడిచింది. ఆమె జీవితం ప్రజల కోసం అర్పించింది అన్నారు మధు. మల్లు స్వరాజ్యం ఆకస్మిక మృతికి సంతాపం తెలిపారు ఏపీ సీఎం జగన్మోహన్…
తెలంగాణలో టీఆర్ఎస్ పై యుద్ధం చేస్తున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. డీజీపీ మహేందర్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. తనను ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణా శాఖ అధ్యక్షులు, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏమాత్రం వాస్తవం కాదన్నారు మహేందర్ రెడ్డి. మా ఇంట్లో జారిపడిన సంఘటనలో నాకు ఎడమ భుజం పైన బోన్ (SCAPULA ) కు మూడు చోట్ల Hairline fractures జరిగాయని ఎక్స్ -రే,…
పోయినవాళ్లు పోగా.. ఉన్నవారిలో ఆయన ఒక్కరే స్వపక్షంలో విపక్షం అనుకున్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేదీ అదేదారి. ఒకరికి ఇద్దరయ్యారు. సేమ్ టు సేమ్. వారి గురించే పార్టీలో ప్రస్తుతం చర్చ. వారెవరో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్‌లోనే ఉంటాననే నమ్మకం కలిగించడం లేదు..!తెలంగాణ కాంగ్రెస్ తీరు మారదా? మంచిరోజులు కనుచూపు మేరలో లేవా? పార్టీలో పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? హస్తం అస్తవ్యస్తమవుతున్నా పట్టించుకోరా? గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలివి. కొన్నిరోజులు ఒకరు.. మరికొన్ని రోజులు…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరతానే ప్రచారం ఊపందుకుంది. పార్టీ అధిష్టానం తీరుపై ఆయన అసహనం వెళ్ళగక్కుతున్న సంగతి తెలిసిందే. తనను కోవర్ట్ అంటూ రేవంత్ రెడ్డి అనుచరులే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పార్టీ వ్యవహారాలపై మాట్లాడవద్దని జగ్గారెడ్డి భావించారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యవహారం మహిళా కమిషన్ వరకూ చేరింది. మహిళా కమిషన్ ని కలిసిన మాజీ మంత్రి గీతా రెడ్డి, రేణుకా చౌదరి రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పీఠం పై కూర్చున్న మూర్ఖుడు అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ అన్నారు గీతారెడ్డి. రాహుల్ గాంధీ పై చేసిన కామెంట్స్ సభ్య సమాజం…
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై ఫిర్యాదు చేసినప్పటికీ తెలంగాణ పోలీసులు చర్యలు తీసుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీ పోలీస్ స్టేషన్ల ముందు ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు నుంచి ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్,…
తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పీసీసీ రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ స్టేట్ సోషల్ మీడియా నేతృత్వంలో టీఆర్ఎస్ ఐటీ సెల్ ఆధ్వర్యంలో పిండ ప్రదానం చేశారు. రేవంత్ రెడ్డి చిత్రపటంతో వెళ్లి ఆయన పిండాలను మూసీ నదిలో కలిపి వారి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై. సతీష్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ వ్యతిరేకి, చంద్రబాబు పెంపుడు కుక్క, పీసీసీ చీఫ్ రేవంత్…