Komatireddy Twist: రాజగోపాల్ రెడ్డి కూడా సేమ్ టు సేమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోయినవాళ్లు పోగా.. ఉన్నవారిలో ఆయన ఒక్కరే స్వపక్షంలో విపక్షం అనుకున్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేదీ అదేదారి. ఒకరికి ఇద్దరయ్యారు. సేమ్ టు సేమ్. వారి గురించే పార్టీలో ప్రస్తుతం చర్చ. వారెవరో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
కాంగ్రెస్‌లోనే ఉంటాననే నమ్మకం కలిగించడం లేదు..!
తెలంగాణ కాంగ్రెస్ తీరు మారదా? మంచిరోజులు కనుచూపు మేరలో లేవా? పార్టీలో పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? హస్తం అస్తవ్యస్తమవుతున్నా పట్టించుకోరా? గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలివి. కొన్నిరోజులు ఒకరు.. మరికొన్ని రోజులు ఇంకొకరు అలక వహించడం కామన్ అయిపోయింది. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు. అప్పట్లో బీజేపీని భుజానికి ఎత్తుకున్నారు. తర్వాత సైలెంట్ అయినా అప్పుడప్పుడు ఆయన మనసు అటే లాగుతోంది. కాంగ్రెస్‌లోనే ఉంటాననే నమ్మకం కలిగించలేక పోతున్నారు రాజగోపాల్‌రెడ్డి. పార్టీ సభ్యత్వ నమోదే ఇందుకు సాక్ష్యం. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదుపై ఆయన ఫోకస్ పెట్టలేదు. ఆయన చొరవ తీసుకుని ఉంటే మునుగోడులో లెక్క వేరేలా ఉండేది.
Also Read
రాజగోపాల్‌రెడ్డి బాటలోనే జగ్గారెడ్డి?
ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి బాటలోనే ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెళ్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ శ్రేణులు. తాజా ఎపిసోడ్‌లో జగ్గారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుకున్నారట. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. జగ్గారెడ్డిని పార్టీ నేతలు బుజ్జగిస్తున్న క్రమంలోనే రాజగోపాల్‌రెడ్డి ఫోన్ చేశారట. రాజీనామాపై తొందరపడకు.. ఇద్దరం కలిసి ఒకేసారి నిర్ణయం తీసుకుందామని జగ్గారెడ్డికి సూచించారట రాజగోపాల్‌రెడ్డి. ఇంతలో 15 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని జగ్గారెడ్డి ప్రకటించడంతో.. ఆయన సూచనతోనే ఆ గ్యాప్ తీసుకున్నారా అనే అనుమానం కలుగుతోందట.
ఇద్దరూ ఒకేలా రియాక్ట్ అవుతారా?
జగ్గారెడ్డి కూడా ఇప్పటికిప్పుడు వ్యవహారాన్ని తెగ్గొట్టేయాలని చూడటం లేదు. కాంగ్రెస్ ముఖ్యుల సూచనతో సమస్యను చక్కబెట్టే అవకాశం ఉంది. అయితే రాజగోపాల్‌రెడ్డి తరహాలోనే కాంగ్రెస్‌లోనే ఉంటూ.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారా? లేక పార్టీతో అంటీముట్టనట్టు ఉంటారా అనేది చూడాలి. పార్టీకి అంటీముట్టనట్టు ఉండటం జగ్గారెడ్డితో అయ్యే పనికాదు. మాట్లాడాలని అనుకుంటే అస్సలు ఉండలేరు. కాంగ్రెస్‌లో రాజగోపాల్‌రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారో జగ్గారెడ్డి కూడా అంతే. మరి.. తాజా ఎపిసోడ్‌లో జగ్గారెడ్డి ఎవరిని ఫాలో అవుతారో? ఎవరి మాట వింటారో కాలమే చెప్పాలి. కాకపోతే ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలలో ఇద్దరు శాసనసభ్యుల తీరు మాత్రం కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ అవుతోంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!