Bigg Boss Telugu 6: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రెండు రోజుల క్రితం మొదలైన విషయం విదితమే. ఇక 21 కంటెస్టెంట్ల మధ్య మొదటి రోజు నుంచే గొడవలు మొదలయ్యాయి.
Revanth Reddy: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై వస్తున్న ఆరోపణలపై రేవంత్ స్పందించారు. వెంకన్న మావాడే అని తెలిపారు. మా మధ్య కొందరు అగాధం కల్గించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీని వీడిన రాజ్ గోపాల్ రెడ్డి వేరు.. పార్టీ కోసం పనిచేస్తున్న వెంకట్ రెడ్డి వేరుని రేవంత్ అన్నారు. వెంకట్ రెడ్డి మా కుటుంబ సభ్యుడని పేర్కొన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి ద్రోహి, రాజ్ గోపాల్ రెడ్డి ప్రస్తావించే బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిందే అని…
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు చింతన్ శిబిర్ నిర్వహించింది. నాయకులు వచ్చారు…తీర్మానాలు చేసి వెళ్ళారు. కానీ…నాయకులు..క్యాడర్‌కి ఏం చెప్పారనే చర్చ మొదలైంది. చింతన్ శిబిర్‌లో వేసిన కమిటీ చైర్మన్ల సమావేశం ముగియక ముందే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి టాగూర్ వెళ్ళిపోయారు. నాయకులు అంతా..మనసు విప్పి చెప్పండి సమస్యలు అంటే…ఇన్నాళ్ళు గోప్యంగా నడిచిన వ్యవహారం అంతా…నాయకులు ఓపెన్ చేశారు. సమస్యలు బయటకు చెప్పిన వారంతా…ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. కనీసం టాగూర్ చెప్పిన సమస్యలకు సమాధానం…
వరంగల్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వరంగల్ సభపై మంత్రి జగదీష్ రెడ్డి తనదైన రీతిలో కామెంట్లు చేశారు. కాంగ్రెస్ హామీలు నీటి మూటలే అన్నారు. దారిపోయే దానయ్యలు మాట్లాడితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కారు. రాసిచ్చిన చిలుక పలుకులు తప్ప రాహుల్ గాంధీ మాటల్లో పసలేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాహుల్ గాంధీ ఏ హోదాలో మాట్లాడారో చెప్పాలన్నారు. ఏ.ఐ.సి.సి ప్రతినిధిగానా…పీసీసీ ప్రతినిధిగా ఆయన…
భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు సంఘర్షణ సభ ద్వారా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు రైతుల్ని మోసం చేస్తున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు. కానీ ఏడేళ్ళలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు సంఘర్షణ సభలో ఆయన మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతుల్ని దగా చేస్తున్నాయి. వివిధ తెగుళ్ళు, వ్యాధులు వచ్చి పంటలు…