వరంగల్ రైతు సంఘర్షణ సభలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడారు. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ. రాబోయే ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు మనం ఏం చేయబోయేది తెలియచేద్దాం. దేశంలో ప్రగతి పథంలో నడిపించింది కాంగ్రెస్. రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. రైతునే రాజుగా చేశాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్ అందించాం. ఇవ్వని హామీలను కూడా అమలుచేశాం. రైతులకు రుణమాఫీ చేశాం. టీఆర్ఎస్ ప్రభుత్వం…
తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు రాహుల్ గాంధీ. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌గాంధీకి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు రాహుల్ గాంధీ హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. అక్కడినించి హనుమకొండకు బయల్దేరతారు. వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరవుతారు. రైతు సంఘర్షణ సభ సాయంత్రం 6.05 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో…
బీజేపీ నేతలపై మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. నిన్న మొన్న రాష్ట్రంలో కొత్త బిచ్చగాళ్ళు తెలంగాణ ప్రజలపై అపారమైన ప్రేమను ఒలకబోస్తున్నారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. తెలంగాణ ను మోసం చేసిన చరిత్ర బీజేపీ ది. మూడు చిన్న రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే 2000 సంవత్సరంలో ఇన్ని బలిదానాలు అయ్యేవా అన్నారు. బీజేపీ అవకాశవాద రాజకీయాల వల్లే తెలంగాణ కు చాలా నష్టం జరిగింది. తెలంగాణ…
150 ఏళ్ళ చరిత్ర కలిగింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర్య సంగ్రామాన్ని నడిపి అనంతరం దేశాన్ని దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యంగా ఏలిన పార్టీ. ఇప్పుడు దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. జాతీయ స్థాయితో పాటు తెలంగాణలోనూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. దీనికి ప్రధాన కారణం గ్రూపు రాజకీయాలు. నాయకులు తమకు తాము అధినేతలుగా భావిస్తూ.. వర్గ రాజకీయాలను పెంచుకుంటూ పోతున్నారు. ఆంధ్రలో పార్టీని త్యాగం చేసి మరీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నాయకుల వైఫల్యం వలన అధికారంలోకి రావాల్సింది…
ఈ దఫా తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ ఆశ. దూరమైన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్‌ఎస్‌ను మరింత బలంగా ఢీకొట్టేందుకు ఈ రెండు పార్టీలు వేయని ఎత్తుగడలు లేవు. ఈ క్రమంలో బీజేపీ రణతంత్రం ఒకలా ఉంటే.. కాంగ్రెస్ పొలిటికల్ వార్ ఇంకోలా ఉంది. కాకపోతే రెండు పార్టీల మధ్య ఒక విషయంలో సారూప్యత ఉండటంతో.. ఆ విషయం తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లో టెన్షన్ పట్టుకుందట. వాటిపైనే…
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే. పార్టీలో ఉన్నారో లేదో తెలియని సమయంలో.. బయటకు వెళ్లిపోతారని చర్చ జరుగుతున్న వేళ పార్టీలో చర్చగా మారారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయన అంటీముట్టనట్టు వ్యవహారం నడుపుతున్నారనే టాక్ ఉంది. సడెన్‌గా హస్తినకు వెళ్లి.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. ఇద్దరు కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత్రితో భేటీ ఒక రహస్యమైతే.. ఇద్దరిపై ఫిర్యాదు చేశారన్న సమాచారం కాంగ్రెస్ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ఠాగూర్, రేవంత్‌ల…
తెలంగాణ కాంగ్రెస్ కి జవజీవాలు తెచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నియమించింది. దీంతో ఆయన వర్గం ఖుషీగా వుంది. శ్రీరామనవమి సందర్భంగా రామగిరిలో సీతారాముల కల్యాణంలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసీసీ తనకు ఈ బాధ్యతలు అప్పగించడంతో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. కేసీఆర్…
పార్టీ ఒకటే కానీ నేతలు వేరయ్యారు. విడిపోయారు. అసలే ప్రజాస్వామ్యం ఎక్కువైన కాంగ్రెస్ పార్టీలు ఆందోళనల్లోనూ ఎవరి ధోరణిలో వారు ముందుకెళుతున్నారు. సంగారెడ్డీ జిల్లా కేంద్రంలో పెంచిన వంటగ్యాస్,పెట్రోల్ ధరలు తగ్గించాలని పోటాపోటీగా ధర్నాలు నిర్వహించారు సంగారెడ్డి నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ ధర్నాతో సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోవడం చర్చకు దారితీస్తోంది. సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ వర్గం, జగ్గారెడ్డి వర్గం వేర్వేరు చోట్ల ధర్నాలు నిర్వహించారు. సంగారెడ్డి…
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళపై పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కౌంటరిచ్చారు టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు. ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ గారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్ లో సంఘీభావం తెలపడం కాదన్నారు కవిత. ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని టిఆర్ఎస్ పార్టీ…