ఈమధ్య కాలంలో తెలంగాణ కాంగ్రెస్ లో మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తనయుడు శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాల గురించి ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలు ప్రస్తావించారు. నేను బహిరంగంగా పార్టీ గురించి మాట్లాడలేదు.. మీడియా ముందు మాట్లాడలేదు.. ప్రజల విశ్వాసం కోసం ప్రయత్నించాలి.. రేవంత్ కు ఎందుకిచ్చారనేది అప్రస్తుతం.. పార్టీ సీనియర్లను కలిసి మాట్లాడుకున్నాం. నేను ఎప్పటికప్పుడు టీపీసీసీ విషయాలు సోనియాగాంధీకి లిఖితపూర్వకంగా తెలియచేశాను. రాజకీయాల్లో కులం గురించి మాట్లాడడం తప్పు. అధిష్టానం దృష్టికి నేను ఈమధ్యకాలం తెలియచేయడం లేదు.
యశ్వంత్ సిన్హా విషయంలో జరిగింది సరైంది కాదు. రాజగోపాల్ రెడ్డి పోతున్నాడనేది వుంది. ఆయన పార్టీకి రాజీనామా చేశాక. పార్టీలో వుంటానన్నారు. తమ్ముడికి అన్న సపోర్ట్ చేస్తున్నారని భావించి వుండవచ్చు. నల్లగొండ రాజకీయాల గురించి ఇద్దరు ఎంపీలు ఉత్తమ్, వెంకట్ రెడ్డితో రేవంత్ రెడ్డి మాట్లాడి వుండాల్సింది. కాంగ్రెస్ సీనియర్లలో అసంతృప్తి ఎందుకు వచ్చిందో చూడాలి. మేం గమ్మున ఊరుకుంటే సరిపోతుందా? ఎవరిని బడితే వారిని తిడితే ఎలా? పార్టీని వీడాలని లేదు. పార్టీ పరిస్థితి మార్చాలి.
Read Also: Marri Shashidhar Reddy: ఆ మాజీ సీఎం తనయుడికి ఎందుకు మండింది?
బ్లడ్ టెస్ట్ రిపోర్ట్, స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చాం. నాకు షోకాజ్ ఇచ్చినా ఫర్వాలేదు. నన్ను ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటా.. శశిధర్ రెడ్డి దేశానికి, రాష్ట్రానికి మంచి పని చేయాలని వుంది. నేను చేసిన ప్రతి మాటకు కామెంట్ చేయను. పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. వచ్చే ఎన్నికల గురించి నేను మాట్లాడను. కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుందో లేదో చూద్దాం. ఇందిరాగాంధీని ఎదిరించింది చెన్నారెడ్డి మాత్రమే. పార్టీలేకున్నా కార్యక్రమాలు చేస్తా. నాన్నగారి ట్రస్ట్ వుంది. పార్టీలో పదవి వున్నా.. లేకున్నా మనం చెప్పే మాటలో బలం వుండాలి. ప్రజలు విశ్వసిందేది అదే. మునుగోడు గురించి అధిష్టానం ఆలోచించాలి. సహజంగా ఉప ఎన్నికల సందర్భంగా గొడవలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు పోటీచేయాలని భావిస్తారు.
నాన్నగారు గతంలో ఓ మాట అనేవారు. అడగనిదే సలహా ఇవ్వవద్దు.. అడిగినా సలహా ఇవ్వాలా లేదా అనేది ఆలోచించాలనేవారు అన్నా మర్రి శశిధర్ రెడ్డి. పార్టీ విషయంలో పొరపాట్లు జరుగుతున్నాయన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు. డాక్టర్ కి నొప్పి వుంటే చెప్పాలి. తప్పు ఎవరిదనేది ఆలోచించాలి. మానిక్కం ఠాగూర్ ని ఏజెంట్ అనడం వెనుక అనేక ఆధారాలున్నాయి. ఇన్ ఛార్జి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేస్తున్నారు. నా అబ్జర్వేషన్ అది. అన్ని ఆధారాలు వున్నాయి. లిఖితపూర్వకంగా ఇచ్చావా లేదా అనేది ఆలోచించాలి.
మాకు మాట్లాడే అర్హత లేదంటే మేం అలాగే వ్యవహరిస్తాం.. పార్టీలోకి ఎవరినో తీసుకువచ్చి దెబ్బకొట్టడానికా? పార్టీ బలోపేతం కావాలంటే ఒక్కరితో సాధ్యం కాదు.. ఏ రెడ్డితో కాదు ఏ వెలమ, నాయుడితో కాదు.. అంతా కలుపుకుని పోవాలి. అలా చేయడం వల్ల పార్టీ బలపడుతుంది. సోనియా అపాయింట్ మెంట్ నేను కోరలేదు. నేను డిమాండ్ చేయడంలేదు. తెలంగాణలో పోటీ ఎవరితో అనేది మానిక్కం ఠాగూర్ ని అడగాలన్నారు మర్రి శశిధర్ రెడ్డి. 2018లో సర్వేలు కాంగ్రెస్ పార్టీ కొంప ముంచాయి.. ఇప్పుడు ఏం అవుతుందో చూడాలన్నారు శశిధర్ రెడ్డి.