భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు సంఘర్షణ సభ ద్వారా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు రైతుల్ని మోసం చేస్తున్నాయి. నరేంద్రమోడీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు. కానీ ఏడేళ్ళలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు సంఘర్షణ సభలో ఆయన మండిపడ్డారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతుల్ని దగా చేస్తున్నాయి. వివిధ తెగుళ్ళు, వ్యాధులు వచ్చి పంటలు పాడైపోతే.. ఎవరూ పట్టించుకోలేదన్నారు. భారతదేశంలో రైతు రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు.
మొత్తం భారతదేశంలో క్రాప్ ఇన్స్యూరెన్ లేని రాష్ట్రం తెలంగాణ అని నేనడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరంగల్ సభకు తరలివచ్చిన రైతులకు ధన్యవాదాలు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేది వరంగల్ సభే అన్నారు. ఎనిమిదేళ్ళలో ముస్లిం సోదరులను మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. రాబోయే 2023లో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. అధికారులు జాగ్రత్తగా వుండాలి. టీఆర్ఎస్ నేతలంతా దోపిడీ దారులే. ల్యాండ్, మైన్స్ అన్నీ దోపీడికి టీఆర్ఎస్ నేతలే కారణం. కాళోజీ మాటల్ని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ నేతలకు బొంద పెట్టాలన్నారు. టీఆర్ఎస్ పార్టీక్ఇ ఘోరీ కడతామన్నారు. రాహుల్ నాయకత్వాన్ని అంతా సమర్ధించాలన్నారు. రైతులు, నిరుద్యోగులు అంతా కలిసి కాంగ్రెస్ ని అధికారంలోకి తెద్దామన్నారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.