Kishan Reddy: వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వేద ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ఈ ఎన్నికల్లో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల స్థానం బీజేపీ ఖాతాలో పడతాయని ధీమా వ్యక్తం చేశారు. మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. కేంద్ర…
మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రం ఏం చేసిందంటూ అందరూ మాట్లాడుతున్నారని.. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వస్తే ఈ పదేళ్లలో మోడీ ప్రభుత్వం ఎం చేసిందో చూపిస్తామన్నారు. గ్రామ పంచాయితీలకు రాష్టం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ప్రధాని మోడీ…
R.Krishnaiah : పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం కాదు, చట్ట ప్రకారం పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బిసి యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షతన 14 బిసి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ…. పంచాయతీరాజ్…
TPCC Mahesh Goud : కేటీఆర్‌కి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన … ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా కేటీఆర్? అంటూ కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం ఆపేసి.. దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయండన్నారు. చెల్లి, బావ ఇచ్చిన షాక్ తో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఆయన హెద్దెవ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ…
KTR : ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్కు కొంత నష్టం జరిగిందన్నా కేటీఆర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగం లేదని ఆయన విమర్శించారు. ఒక కుటుంబం వరద నీళ్లలో చిక్కుకుంటే కనీసం హెలికాప్టర్ తెప్పించి కాపాడాలన్న సోయి మంత్రులకు లేదని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేల బర్త్‌డేలకు ఇంకా వేరే పనికిమాలిన పనులకు మంత్రులు హైదరాబాద్…
Mandakrishna Madiga : ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం జరుగుతుందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. చట్టసభలో తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ కు అండగా ఉన్నారని, షమీమ్ అక్తర్ నివేదికను ఆలస్యం లేకుండా ఆమోదించారన్నారు. వర్గీకరణను స్వాగతిస్తున్నామని, రిజర్వేషన్ పర్సంటేజ్ విషయంలో కొన్ని లోపాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కులాల చేర్పులు మార్పుల్లో లోటుపాట్లపై వినతి పత్రం అందజేశామని, మేం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంతో మందకృష్ణ సమావేశం అయ్యారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యె సంపత్ కుమార్, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు. Also Read: Ponnam Prabhakar: సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత, హక్కు…
Ponnam Prabhakar : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు… మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌ని అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తున్నారు మతోన్మాదులు అంటూ ఆయన ఆగ్రహం…