Bhatti Vikramarka : భారీ అప్పుల్లోనూ సంక్షేమానికి తడబాటులేదు
- ఆదాయం లేకపోయినా సంక్షేమం కొనసాగుతుంది
- ఇందిరమ్మ ఇళ్లకు భారీ కేటాయింపు
- రాజీవ్ పథకంపై ఫేక్ న్యూస్ నమ్మవద్దు : భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఆదాయం లేని పరిస్థితుల్లోనూ, అప్పులపై వడ్డీలు కట్టడం వంటి ఆర్థిక బాధ్యతలు వహిస్తూ సంక్షేమ పథకాలను నిలకడగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆరోపించారు. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఖాళీగా వదిలిందని విమర్శించారు. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. 90 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందజేస్తున్నట్లు వెల్లడించారు.
Cyberabad Police: ఆదమరిస్తే అంతే సంగతులు.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
Also Read
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూ.9,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. జూన్ 2న లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన సిబిల్ స్కోర్పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని యువతకు విజ్ఞప్తి చేశారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తామని, నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇళ్లు లేని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.12,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా సంక్షేమం అమలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. త్వరలోనే ఇందిర సౌర గిరిజన వికాసం కింద ఆదివాసీ రైతులకు బోర్లు, సోలార్ పవర్ పంప్‌సెట్లు, డ్రిప్ వ్యవస్థలను అందజేస్తామని చెప్పారు. ఈ నెల 18న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు.
AP Govt: మనుషులకు ఆధార్ తరహాలో పశువులకు గోధార్.. ఏపీ ప్రభుత్వం కసరత్తు!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!