Ponnam Prabhakar : హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఆధారంగా నిర్మితమైన చలనచిత్రాన్ని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నేతలతో కలిసి వీక్షించారు. ఈ సందర్బంగా సామాజిక సమానత్వం, మహిళా సాధికారత, విద్యా ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చ జరగింది. సినిమా చూసిన వారిలో ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ప్రముఖ సామాజికవేత్త కంచె ఐలయ్య, ఎంపీ సురేష్ షెట్కర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీసీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకట్, ముఠా గోపాల్, శ్రీహరి ముదిరాజ్, శంకరయ్య, ప్రకాష్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్‌లు, గ్రంథాలయ సంస్థ , మార్కెట్ కమిటీ చైర్మన్‌లు పాల్గొన్నారు.
PakIstan: భారత్ టార్గెట్‌గా అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కంచె ఐలయ్య సూచనల మేరకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలకు ఈ సినిమాను ప్రదర్శించామని తెలిపారు. ఇది జ్యోతిరావు పూలే వారి ఆశయాలను విస్తృతంగా విపరిణమించేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. విద్యను ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వాలని, అది సమాజాన్ని ముందుకు నడిపించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వాలని, వారి అభివృద్ధికి సహకరించాలని పూలే వారిని ఆదర్శంగా నిలిపారు.
Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది
దేశంలో మొదటిసారి కుల గణన చేపట్టిన ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి గుర్తుచేశారు. ఇది మహాత్మా జ్యోతిరావు పూలే స్పూర్తితోనే సాధ్యమైందన్నారు. బీబీ మాండల కమిషన్, కాకాసాహెబు కాలేల్కర్ వంటి మహనీయుల కృషిని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్లపై ఎస్సీ, ఎస్టీ లకు కూడా అవకాశం కల్పించాలన్న అభిప్రాయం పెండింగ్‌లో ఉండటం బాధాకరమన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పిన సామాజిక సమీకరణ మారాలన్న సందేశాన్ని గుర్తు చేసిన పొన్నం ప్రభాకర్, సినిమా ద్వారా ప్రజల్లో చైతన్యం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులను కలుసి ఈ సినిమాకు డబ్బింగ్, ట్యాక్స్ మినహాయింపును తీసుకురావడానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. సినిమాలో చూపించిన అంశాలు ప్రతి బలహీన వర్గానికి చెందిన పిల్లలకు విద్యకు దూరంగా ఉండకుండా చేస్తాయని, మహిళా సాధికారతకు పూలే దంపతులు నిలువెత్తు ఆదర్శమన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.