Bhatti Vikramarka : విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన కార్మికుడికి కోటి రూపాయల బీమా చెక్కు ఇవ్వడం దేశంలోనే ఇదే తొలిసారి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్‌లో ఎన్‌పీడీసీఎల్ పరిధిలో పనిచేసిన జోగు నరేశ్ కుటుంబానికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును, ఆయన భార్యకు విద్యుత్ శాఖలో కారుణ్య నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, “ఇలాంటి గొప్ప నిర్ణయం కేవలం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంతోనే సాధ్యమైంది. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం విద్యుత్ కార్మికుల గురించి ఇలా ఆలోచించలేదు” అని చెప్పారు.
Pawan Kalyan: ఒకే దేశం, ఒకే ఎన్నిక దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుంది
ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రమాద బీమా, కారుణ్య నియామక నిర్ణయాలు నిజమైన సంక్షేమ పాలనకు అద్దం పట్టే ఉదాహరణలుగా ఆయన అభివర్ణించారు. “ఈ పథకాన్ని మొదట సింగరేణిలో ప్రవేశపెట్టి, తర్వాత విద్యుత్ సంస్థలకూ విస్తరించాం. కోటి రూపాయల బీమా ఎంతో భరోసానిస్తుంది. ఇది ఒక్క కుటుంబానికి కాదు, మొత్తం విద్యుత్ శాఖ కార్మికులకు ఉత్తేజం,” అని భట్టి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ, బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Vallabhaneni Vamsi: గుంటూరు జీజీహెచ్‌లో వంశీకి చికిత్స.. పోలీసులతో పంకజశ్రీ వాగ్వాదం!