తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో విచారణ పూర్తి అయ్యింది.. ఈ కేసులో విచారణ పూర్తిచేసిన సిటీ సివిల్ కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది.. కాగా, రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు.. టాలీవుడ్ డ్రగ్స్ కేసు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది.. డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ ప్రముఖులతో మంత్రి కేటీఆర్‌కు సంబంధాలు ఉన్నాయని.. అలాగే డ్రగ్స్‌కు కేటీఆర్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి.. పొలిటికల్ హీట్ పెంచారు.. దీనిని సీరియస్‌గా తీసుకున్న కేటీఆర్.. పరువునష్టం దావా వేయగా.. విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు.. రేవంత్‌రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ కూడా హీట్ పెంచుతోంది.. రేవంత్ వైఖరికి నిరసనగా ఆయన నివాసాన్ని ముట్టడించారు టీఆర్‌ఎస్ కార్యకర్తలు.. ఈ సందర్భంగా టీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఉద్రిక్తతలకు దారితీసింది.