తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యం లో… తెలంగాణ మంత్రి కేటీఆర్ మరియు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. డ్రగ్స్ టెస్టు లకు నువ్వు సిద్దామా ? అంటే నువ్వు సిద్దామా ? అన్న రీతిలో ఇద్దరూ లీడర్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యం లో తాను డ్రగ్స్ టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. టెస్ట్ కోసం రాహుల్ గాంధీ వస్తే తాను కూడా రెడీ అని స్పష్టం చేశారు. చర్లపల్లి జైలు జీవితం గడిపిన వ్యక్తులు రాహుల్ గాంధీని ఒప్పించాలని… రేవంత్ రెడ్డికి చురకలంటించారు. అయితే.. దీనికి తాజాగా మంత్రి ట్వీట్ పై రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. మంత్రి కేటీఆర్ చెప్పిన విధంగా లై డిటెక్టర్ పరీక్ష కు సిద్ధంగా ఉన్నానని… తమతో పాటు కేసీఆర్ కూడా సహారా కుంభకోణం, ఈఎస్ఐ కుంభకోణం సీబీఐ కేసులలో లై డిటెక్టర్ టెస్ట్ లకు వస్తారా ? అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.