కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ ను స్వీకరించకుండా…. మంత్రి కేటీఆర్ పారిపోయాడని మండిపడ్డారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డీ ఛాలెంజ్ లో ముందుకు వచ్చారని.. కానీ కేటీఆర్ మాత్రం రాలేదన్నారు. విశ్వనియత నిరూపించుకోవాలి అంటే… కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ కి రావాల్సిందేనని స్పష్టం చేశారు షబ్బీర్ అలీ. 14 యేండ్ల పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారని అకున్ సబర్వాల్ నివేదిక చెప్పిందని…గుర్తు చేశారు. రాజీకయ నాయకులు మరియు సినిమా తారలు డ్రగ్స్ విషయం లో క్లియర్ ఉండాలని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసు విచారణలో వుండగానే ఆకున్ సబర్వాల్ ను తప్పించారని…. బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ వరకు పబ్బులు వ్యాప్తి చెందాయని మండిపడ్డారు.