ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన దీక్ష బదులు ఉమ్మడి పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. శనివారం నాడు జరిగిన జూమ్ మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యక్రమాల ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.…
ఆ పార్టీలో పదవులు రాకుంటే పెద్దస్థాయిలో పంచాయితీ జరుగుతుంది. తీరా పదవులు ఇస్తే పని చేయడం లేదట. తాపీగా రిలాక్స్ అవుతున్నారట. వర్క్ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిన నాయకులు ఎవరు? వర్కింగ్ ప్రెసిడెంట్లకు నో వర్క్.. నో మూడ్..!తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు.. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డితోపాటు ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ను నియమించారు. మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మహేశ్‌గౌడ్, అజారుద్దీన్.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌లు ఆ…
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ న్యూ ఇండియా అస్యూరెన్సు కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. సభ్యత్వం తీస్కున్న కార్యకర్తలు ప్రమాదంలో మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయల పరిహారం అందేలా, ప్రమాదం జరిగి ఏదైనా శరీర అవయవాలు దెబ్బతింటే ప్రమాదం తీవ్రతను బట్టి పరిహారం అందుతుంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ…
మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉంది. రకరకాల హోదాలు ఇచ్చి ప్రయోజకుడిని చేద్దాం అని కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ తండ్రి వల్ల కావడం లేదు. కేటీఆర్ నిర్వహించిన ప్రతీ శాఖ దివాలా తీసింది. కేటీఆర్ నిన్న సవాల్ విసిరారు. నాలుగేండ్లు 50 వేల కోట్లు రైతు బంధు ఖాతాలలో వేశాం అన్నారు. కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా. రైతులకు…
చైనాలో తయారైన రామనుజాచార్యుల విగ్రహావిష్కరణకు రావద్దని, అలా వస్తే మీరు దేశద్రోహులే అవుతారని ప్రధాని మోడీని ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోడీ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్, మోడీ దేశభక్తి నేతి బీరకాయలో నేతి అంత అని ఆయన ఎద్దేవా చేశారు. Read Also: పాల్వంచ ఘటన..రామకృష్ణ తల్లి, సోదరి అరెస్టు బీజేపీ నేతలు మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు చెబుతారని,…
తెలంగాణలో ఆ రెండు పార్టీల పంచాయితీలో కాంగ్రెస్ సైడ్ అయిపోయిందా..? రాజకీయ చదరంగంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది ఎవరు..? ఆ రెండు పార్టీల వ్యూహంలో కాంగ్రెస్ పాత్ర ఏంటి? బీజేపీ, టీఆర్ఎస్ల మధ్యే విమర్శలు.. కాంగ్రెస్ మౌనం..!తెలంగాణ రాజకీయాలు ఒకింత ఆశ్చర్యంగా.. మరికొంత వ్యూహాత్మకంగా నడుస్తున్నాయి. గడిచిన రెండు నెలలుగా పొలిటికల్ వార్ బీజేపీ.. టీఆర్ఎస్ మధ్యే సాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు మొదలుకుని.. ఉద్యోగుల కేటాయింపు వరకు ఈ రెండు పార్టీల మధ్య గట్టిఫైటే జరుగుతోంది. ఈ…
తెలంగాణ రాజకీయంలో రోజుకో వీధి బాగోతం నడుస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో నటులను ఇక్కడికి తెచ్చి రంజింప చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు.
తెలంగాణలో ఇటీవల జరిగిన బదిలీలపై మనస్తాపం చెందిన ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్‌లో చోటుచేసుకుంది. బాబాపూర్‌కు చెందిన సరస్వతి ఇప్పటివరకు స్వగ్రామంలోనే పనిచేసింది. ఇటీవల ఆమెను నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డికి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండాకు బదిలీ చేశారు. దాంతో మనస్తాపం చెందిన సరస్వతి ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. Read Also: చంద్రబాబు ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు నమ్మరు:…
పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు తాకాయి. రైతులు అడ్డుకోవడంతో ఆయన ఫిరోజ్ పూర్ జిల్లాలో ఓ ఫ్లైఓవర్ పై 20 నిమిషాల పాటు నిర్భంధంలో ఉండాల్సి వచ్చింది. ఇది భద్రతా వైఫల్యం అంటూ కేంద్రం పేర్కొంది. కాంగ్రెస్ పాలిత పంజాబ్ సర్కారే దీనికి బాధ్యత వహించాలని అంటోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. హత్యకు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేందర్రావు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.. పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాఘవ.. దౌర్జన్యాలు, కీచక పర్వాలు.. సెల్ఫీ వీడియోతో బయటపెట్టాడు రామకృష్ణ.. తాను, తన కుటుంబం ఆత్మహత్య చేసుకునే ముందు రామృకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది.. అయితే, ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు..…