తెలంగాణ కాంగ్రెస్‌లో ఫిర్యాదులు కామన్ అయిపోయాయా? రోజుకో కంప్లయింట్ పీసీసీకి తలనొప్పిగా మారిందా? హైకమాండ్‌కు వివరణ ఇవ్వటానికే టైమ్ సరిపోతోందా? వరస ఫిర్యాదులపై అధిష్ఠానం ఏం చేయబోతుంది? ప్రతి సమస్యపై ఏఐసీసీకి లేఖలు రాసేస్తున్నారా?తెలంగాణ కాంగ్రెస్‌కి ప్రధాన శత్రువులు ఎక్కడో ఉండరు. సొంత పార్టీలోని నాయకులే.. పార్టీ నేతను కట్టడి చేస్తారు. అనుకున్నది అనుకున్నట్టు అయితే.. ఓకే..! లేదంటే హైకమాండ్‌కు ఫిర్యాదులు కామన్. ఇది కాంగ్రెస్‌లో సర్వసాధారణం. అందుకే కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు.…
నిన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో నేడు టీకాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. అత్యున్నత స్థానంలో ఉన్న మోడీ తన స్థాయిని మరిచిపోయి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రత్యకప్రసారం చూడడానికి క్రింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి.
పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారని ఆరోపిస్తూ సీఎం కేసీఆర్‌పై సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో టీపీసీపీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ వరప్రసాద్‌కు ఫిర్యాదుతో పాటు రాజ్యాంగం ప్రతిని కూడా అందజేశారు. తమ ఫిర్యాదు ఆధారంగా సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి కూడా పాల్గొన్నారు. Read Also: సీఎం కేసీఆర్‌కు జ్వరం.. ప్రధాని కార్యక్రమానికి…
భారత రాజ్యాంగం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలలపై ప్రతిపక్షాలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నాయి.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.. అయితే, ఈ వ్యవహారంలో సీఎంపై అన్ని పీఎస్‌లపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. రేపు అన్ని పోలీస్ స్టేషన్లలో సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ మాటల వెనక కుట్ర ఉందన్న ఆయన.. నరేంద్ర మోడీ ఆదర్శ నాయకుడు పుతిన్ అయితే.. కేసీఆర్…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2017లో దాఖలు చేసిన పిల్‌పై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రచనరెడ్డి పేర్కొంది. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదన్నారు. ఆన్లైన్ విచారణలో నేరుగా కోర్టుకు ఈడీ జేడీ అభిషేక్ గోయెల్ వివరించారు. ఈడీ…
మోడీ బడ్జెట్ తో దేశానికి మేలు జరగదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు మేలు, యువకులకు ఉపాధి, మహిళలకు రక్షణ వేటికి ప్రధాన్యత లేదని, కేసీఆర్ ప్రెస్ మీట్ లో మర్యాద లేదని ఆయన అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి నందుకు రైతులపై కక్షగట్టి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని, ఎరువుల సబ్సిడీ తగ్గించారు.పంటలకు మద్దతు ధర…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధికార పక్షంతో పోరాడటం పక్కన ఉంచితే స్వపక్షంలో విపక్షాలు తయారవుతున్నాయి. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవల తనకు అవమానం జరిగిందని.. తనను అవమానపరిచిన మంచిర్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని పట్టుబట్టాడు. ప్రస్తుతం ఈ షోకాజ్ నోటిసే కాంగ్రెస్…
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడలు చేస్తారా అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇవ్వకపోగా అరెస్టులు చేసి జైల్లో పెడతారా..? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాగే నిర్భందం కొనసాగిస్తే ప్రతిఘటన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాయకులపై దాడులు, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడానికి…
తెలంగాణలో విద్యార్థులు ..ఉద్యోగుల ఆకాంక్షలు నేర వేరడం లేదని.. ప్రజల కోసం జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ విధానాలవల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చక్రవర్తి అయితే… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ సామంత రాజు అంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. త్వరలో…