తెలంగాణలో కాంగ్రెస్ హయాంలోనే ప్రగతి సాధ్యమయిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నారాయణ పేట్ కోస్గి పట్టణ కేంద్రంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హల్లో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నియోజక వర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి TPCCఅధ్యక్షులు , మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 500 మందికి పైబడి సభ్యత్వం చేయించిన నాయకులను ఘనంగా సన్మానించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ కొడంగల్ నియోజక వర్గంలో…
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మిర్చిరైతుల సమస్యలపై బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారంగా చెల్లించాలన్నారు.మిగత పంటలకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయాలన్నారు. రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా…
ఆయనో మాజీ ఎంపీ. ఎక్కడ ఎన్నికలు జరిగినా జోస్యం చెప్పేస్తారు. ఎవరి బలం ఏంటో ముందే ప్రకటించే ఆయన.. తాను ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని పార్టీలు అప్రమత్తం అవుతుంటే.. ఆ మాజీ ఎంపీ మాత్రం సైలెంట్. ఎందుకలా? ఎవరా మాజీ ఎంపీ? కొండాతో కలిసి సాగడానికి సాహసించడం లేదా?మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకసారి కాంగ్రెస్ అధినాయకత్వంపై విమర్శలు చేస్తారు. మరోసారి బీజేపీ పథకాలు, కార్యక్రమాలపై…
TRS రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్.. కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 24న కాంగ్రెస్ అధినేత్రి సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత కారు ఎక్కిన ఆయన.. తిరిగి సొంత గూటికి వస్తున్నారు. ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీ సి సి అధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే తగిన ప్రాధాన్యత…
రాష్ట్రంలో జరిగే దుర్మార్గ చర్యల వెనుక కేసీఆర్, మోడీ ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అశు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అశు ఎర్రబెల్లి గెలుపు కోసం గతంలో పని చేశారన్నారు. ఎర్రబెల్లి గెలిచిన తర్వాత అభివృద్ధిపై ఏ మాత్రం దృష్టి సారించకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్లపై మంత్రి ఎర్రబెల్లి కేసీఆర్‌పై ఒత్తిడి తేకపోవడంతోనే ఎర్రెబెల్లిపై విసిగిపోయార్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల సమస్యల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు…
తెలంగాణలో పెద్ద ఎత్తున మెంబర్ షిప్ చేయించాలని కృతనిశ్చయంతో వున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ దిశగా నేతలు, కార్యకర్తల్ని ముందుకు నడిపిస్తున్నారు. 5 మండలాలలో పార్టీ బలంగా ఉంటే అసెంబ్లీ గెలుస్తాం అన్నారు రేవంత్ రెడ్డి. 35 మండలాలలో బలంగా ఉంటే ఎంపీ స్థానం గెలుస్తాం.. 600 మండలాలలో పార్టీ బలపడితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అని రేవంత్ నేతలకు వివరించే ప్రయత్నం చేశారు. మండలాలలో అధ్యక్షులు సరిగా పని చేయకపోతే వారిపై చర్యలు…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క లేదు- అందుకే మోడీ వీడియో కాన్ఫిరెన్సు కు హాజరు కాలేదన్నారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తుంది. యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నాం అని కేసీఆర్ అంటాడు. అసలు టీచర్ల నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఎందుకు…
నల్లగొండలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా సాగుతోంది. అయితే మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశంలో కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఫ్లెక్సీపై మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి ఎల్ అర్ ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు అభ్యంతరం తెలిపారు. దీంతో సీనియర్ నేత జానారెడ్డి జోక్యం చేసుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడారు. మిర్యాలగూడ నుండే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కాపాడాలి. రాష్టంలో కాంగ్రెస్ ప్రతిష్టను…
కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి 80వ జయంతి సందర్భంగా నెక్లెస్‌రోడ్డులోని స్పూర్తి స్థల్లో కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు మాట్లాడుతూ.. ఏ పార్టీలో ఉన్న అందరితో కలిసి మెలిసి జైపాల్ రెడ్డి పని చేశారని, జైపాల్ రెడ్డి లేకపోవడంతో దేశానికి చాలా లోటని ఆయన అన్నారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని ఆయన గుర్తు చేశారు. నిత్యం పార్టీ, దేశం కోసం ఆలోచించే వారని ఆయన…
నెక్లెస్ రోడ్డులో స్ఫూర్తి స్థల్లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 80వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి లేకపోయినా ఆయన సాధించిన తెలంగాణలో మనము ఉన్నామన్నారు. రాజకీయ విలువలు కాపాడడంలో జైపాల్ రెడ్డి ఒకరని, దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు జైపాల్ రెడ్డి తీసుకున్నారని గుర్తు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌లో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయన…