MLA Jeevan Reddy : ప్రతి పక్షాల చిన్న మెదడు చితికి పోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRS MLA Jeevan Reddy Countered to BJP and Congress Leaders statements.
తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. అయితే రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే ప్రకటన మాత్రమే చేశారు.. ఇంకా నోటిఫికేషన్‌లు ఇవ్వలేదని.. సంబరాలు చేసుకుంటున్నవారికి పిచ్చి ముదిరిందంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రతి పక్షాల మాటలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే కొలువులు, చదువులు, రూపాలు అని ఆయన అన్నారు.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
తెలంగాణ రాదని చెప్పారు కానీ తీసుకొచ్చింది కేసీఆర్ అని, కాళేశ్వరం కట్టలేరు అన్నారు కానీ కేసీఆర్ కట్టి చూపించారన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కేసీఆర్ ఇచ్చారని, ప్రతి పక్షాలు చిన్న మెదడు చితికి పోయింది ఈ దెబ్బ తో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ అంటే ఒక చరిత్ర.. కేసీఆర్ ఒక సూపర్ స్టార్ అని ఆయన కొనియాడారు. రేవంత్ రెడ్డి మెదడు దొబ్బిందని, కేసీఆర్ టీఆర్ఎస్ మోసపూరిత పార్టీ అంటున్నాడు రేవంత్ అని, వారిని నమ్మి నిరుద్యోగులు మోసపోకండని ఆయన అన్నారు. నేను ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తానని, చక్కగా చదువుకోండి అంటూ ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అనుబంధ సంస్ధల నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయి జాబులు తెచ్చుకోండని వెల్లడించారు.
తాజావార్తలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?