తెలంగాణలో ఆ రెండు పార్టీల పంచాయితీలో కాంగ్రెస్ సైడ్ అయిపోయిందా..? రాజకీయ చదరంగంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది ఎవరు..? ఆ రెండు పార్టీల వ్యూహంలో కాంగ్రెస్ పాత్ర ఏంటి? బీజేపీ, టీఆర్ఎస్ల మధ్యే విమర్శలు.. కాంగ్రెస్ మౌనం..!తెలంగాణ రాజకీయాలు ఒకింత ఆశ్చర్యంగా.. మరికొంత వ్యూహాత్మకంగా నడుస్తున్నాయి. గడిచిన రెండు నెలలుగా పొలిటికల్ వార్ బీజేపీ.. టీఆర్ఎస్ మధ్యే సాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు మొదలుకుని.. ఉద్యోగుల కేటాయింపు వరకు ఈ రెండు పార్టీల మధ్య గట్టిఫైటే జరుగుతోంది. ఈ…
తెలంగాణ రాజకీయంలో రోజుకో వీధి బాగోతం నడుస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో నటులను ఇక్కడికి తెచ్చి రంజింప చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు.
తెలంగాణలో ఇటీవల జరిగిన బదిలీలపై మనస్తాపం చెందిన ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్‌లో చోటుచేసుకుంది. బాబాపూర్‌కు చెందిన సరస్వతి ఇప్పటివరకు స్వగ్రామంలోనే పనిచేసింది. ఇటీవల ఆమెను నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డికి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండాకు బదిలీ చేశారు. దాంతో మనస్తాపం చెందిన సరస్వతి ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. Read Also: చంద్రబాబు ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు నమ్మరు:…
పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీకి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగలు తాకాయి. రైతులు అడ్డుకోవడంతో ఆయన ఫిరోజ్ పూర్ జిల్లాలో ఓ ఫ్లైఓవర్ పై 20 నిమిషాల పాటు నిర్భంధంలో ఉండాల్సి వచ్చింది. ఇది భద్రతా వైఫల్యం అంటూ కేంద్రం పేర్కొంది. కాంగ్రెస్ పాలిత పంజాబ్ సర్కారే దీనికి బాధ్యత వహించాలని అంటోంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. హత్యకు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేందర్రావు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.. పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాఘవ.. దౌర్జన్యాలు, కీచక పర్వాలు.. సెల్ఫీ వీడియోతో బయటపెట్టాడు రామకృష్ణ.. తాను, తన కుటుంబం ఆత్మహత్య చేసుకునే ముందు రామృకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది.. అయితే, ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య సఖ్యత కుదరడం లేదనే వార్తలు వస్తూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి విముఖతతో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అయితే తాజాగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. దీంతో ఒక్కసారి టీకాంగ్రెస్ సీనియర్ నేతలు ఉలిక్కి పడ్డారు. ఈ పరిణామాల నడుమ జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాన్ని ప్రత్యక్షప్రసారంగా వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
కాంగ్రెస్ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నాలుగు గంటలపాటు కొనసాగింది. జూమ్ ఆప్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్చార్జ్ మానిక్కమ్ ఠాగూర్ అధ్యక్షత వహించారు. కన్వీనర్‌గా షబ్బీర్ ఆలీ సమావేశాన్ని కొనసాగించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు మిగిలిన పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానిక్కమ్ ఠాగూర్ మాట్లాడుతూ .. పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ ప్రకటించిన కార్యక్రమాలను కింది స్థాయి నుంచి చేపట్టాలని పిలుపునిచ్చారు. Read Also:పీఆర్సీ పై…
శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీనే క్రమశిక్షణ తప్పిందా? ఇన్నాళ్లు క్రమశిక్షణ కమిటీపై రాని ఆరోపణల ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? చిన్నారెడ్డి కామెంట్స్‌తో మరో మలుపు తిరిగిన రగడతెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లక్ష్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. మెదక్ పర్యటన సమాచారం ఇవ్వలేదనే అంశంపై మొదలై.. రేవంత్ కూడా కోవర్టే అనే వరకు విమర్శలను…
తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు.. మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. మరోవైపు ఒమిక్రాన్ కూడా టెన్షన్ పెడుతోంది.. ఇక, ఎవ్వరినీ వదిలేదు అనే తరహాలో సామాన్యులు, నేతలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పీఎంలు.. అధికారులు.. ఎవరైతే నాకేంటి అనే విధంగా.. అందరినీ టచ్ చేస్తోంది మాయదారి కరోనా.. తాజాగా, టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. నిర్ధారణ…
టీఆఆర్ఎస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. గంజాయి తెలంగాణగా మార్చేశారని ఆయన మండిపడ్డారు. గంజాయి మత్తులో టీఆర్ఎస్ గుండాల దాడిలో కాంగ్రెస్ నేత హత్యచేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల మధ్య మద్యం సేవించవద్దు అన్నందుకు టీర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారన్నారు. హతుడి సోదరుడితో ఫోన్లో మాట్లాడి పరామర్శించిన రేవంత్ రెడ్డి. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Read…