ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన మన ఊరు-మన పోరు సభ ముగిసింది. 35 వేల మెజారిటీతో సురేందర్ ని గెలిపిస్తే టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించే సమయం కూడా లేదు. ఒక్క ఎమ్మెల్యే డబ్బులు పెట్టుకుంటే వందలాది కరడుగట్టిన సైనికులను తయారు చేస్తాం.టీఆర్ఎస్ పాలనలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కోటి ఎకరాలకు నీరు, ఉచిత విద్యుత్ ఇచ్చామని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ రైతు ఏం చేయాలి చెప్పాలన్నారు. వరి కొనుగోలు చేయదు…చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు లేవు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఎర్ర జొన్న పంట కనుమరుగయింది. మక్కలు కొనుగోలు చేయదు. మరి రైతుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో కేసీఆర్ చెప్పాలన్నారు రేవంత్ రెడ్డి. పంజాబ్, హర్యానా రైతులకంటే నిజామాబాద్ రైతులు చైతన్యవంతులు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని ముఖ్యమంత్రి కూతురు కవితను ఓడించారు. గెలిపిస్తే పసుపు బోర్డ్ తెస్తామని హామీ ఇచ్చి మరచిన ఎంపీని కూడా ఓడించాలి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో పండించే వడ్ల ఎవరు కొనుగోలు చేస్తారో రాష్ట్రంలోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని కూడా వాళ్ళు కొనుగోలు చేయాలన్నారు. రైతులకు అన్యాయం చేస్తే దొడ్డు కర్రలు పట్టుకున్న సైన్యంతో వెంటాడతాం. ఐకెపి కేంద్రాలను తెరవాలి… అవసరమై గన్ని సంచులను ప్రభుత్వం కొనుగోలు చేయాలి.. లారీ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటుచేసి మిల్లర్ల కు టార్గెట్ ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి. రైతులకు అన్యాయం జరిగితే ఫార్మ్ హౌస్ గోడలను లక్షల మంది సైన్యంతో బద్దలు కొడతాం అన్నారు రేవంత్ రెడ్డి.
ఎల్లారెడ్డి గడ్డ మీద మరోసారి కాంగ్రెస్ గెలుస్తాదన్నారు. సదాలక్ష్మి, ఈశ్వరీ బాయి, బాల గౌడ్ లు చాలా మంది ఈ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహించారు.గెలుపు ఓటములు సహజం.. దళితుడైన గంగారాం.. పార్టీ కోసం 40 ఏళ్ళు పార్టీకి సేవ చేసాడన్నారు రేవంత్ రెడ్డి. కళ్ళాల్లో కాంగ్రెస్ కార్యక్రమం భాగంగా ఇక్కడే తిరిగాం. వరి పండించిన రైతులను మోసం చేస్తే ఎల్లారెడ్డి నడి బజార్లో ఉరి తీస్తాం అని అపుడే చెప్పాననన్నారు. సభ సందర్భంగా దారిపొడవునా అపూర్వ స్వాగతం లభించింది.
షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కేసీఆర్ రేపటి నుండి కొత్త నాటకంకి తెర లేపారని, వరి ధాన్యం ఎట్లా కొనరో చూద్దాం అన్నారు. 8ఏళ్ళ నుంచి ఏం చేశావని ప్రశ్నించారు. మోడీ..నాకేం వద్దు…కొంచెం ప్రేమ పంచు చాలు అన్నప్పుడు ఏమైంది? వరి కొనుగోలు చేత కాకపోతే సీఎం పదవి నుండి దిగిపో అన్నారు. మేము చూపిస్తాం..వడ్లు ఎలా కొనాలో. బోనస్ ఇచ్చి రైతులని ఆదుకుంటాం అన్నారు షబ్బీర్ అలీ.