కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అడుగడుగునా అడ్డంకులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం నిర్వహించారు. అయితే సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు చేదు అనుభవం ఎదురైందని, తనను అవమానించేవాడు కాంగ్రెస్‌లో ఎవడూ లేడని అన్నారు. అంతేకాకుండా మెదక్ జిల్లాకు వెళితే పీసీసీ సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ పద్ధతి తనకు నచ్చడం లేదని, ఈ…
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని విపక్ష నేతలు ముక్తకంఠంతో అంటున్నారు. అయితే గతంలో కూడా కేసీఆర్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. మళ్లీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో తెలంగాణలో విపక్ష పాత్ర పోషించే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పలేకపోయింది. అయితే ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకమైన నాటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త జోష్‌తో ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా రేవంత్…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రధాని మోదీని కథ తేలుస్తా.. గద్దె దించేవరకు నిద్రపోనని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని రేవంత్ ఆరోపించారు. జార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరేన్‌ను కలిసిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి ఫ్రంట్ పెట్టడంలేదని కేసీఆర్ చెప్పారని విమర్శించారు. కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని.. రాష్ట్రంలో పేదల కష్టాలు తీర్చాల్సిన ఆయన దేశం అంతటా…
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి.. రేవంత్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మల్లు రవి.. వీహెచ్ నాకు అన్న లాంటివారు.. కానీ, ఆయన వ్యాఖ్యలు ఖండిస్తున్నానని పేర్కొన్నారు.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కంటే ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ అని గుర్తుచేసిన ఆయన.. బీహార్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పోస్టులు ఇవ్వొద్దు అని రేవంత్ ఎక్కడా…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే ఆయన.. తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వల్లనే రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు.. ఇలా అయితే, పాత కాంగ్రెస్ వాళ్లు ఏం కావాలి..? అని నిలదీశారు.. పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్లను కూడా పక్కన పెడుతున్నాడని విమర్శించిన వీహెచ్… ఈ విషయాలను అధిష్టానానికి చెబుతాం అంటే అపాయింట్మెంట్ ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే…
ఇప్పటికే ఐఏఎస్ అధికారుల విషయంలో రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.. ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లలో పక్షపాత వైఖరి సరికాదని సూచించారు.. బీహార్ అధికారులే మీకు నచ్చడం.. మెచ్చడం వెనక ఉద్దేశం ఏంటి..? అని లేఖలో ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి… DOPT నిబంధనలకు వ్యతిరేకంగా సోమేష్ కుమార్‌ని ఎలా సీఎస్‌ను చేశారని నిలదీశారు.. HMDA, RERAలో అరవింద్, సోమేష్ కుమార్ ఇచ్చిన అనుమతులపై విచారణ జరిపించాలని…
తెలంగాణ కాంగ్రెస్ లో కుదుపునకు కారణం అయ్యారు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. పదిహేను రోజుల పాటు తన రాజీనామాకు బ్రేక్ వేసావనన్నారు జగ్గారెడ్డి, సోనియా గాంధీని, రాహుల్ గాంధీ ని కలవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు జగ్గారెడ్డి. ఇదే సమయంలో తాజాగా సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే…
ఒకప్పుడు కాంగ్రెస్ గా కంచుకోట అయిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ కార్యాచరణను మొదలు పెట్టారా… అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో ఎంపీ లు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారా.. అందుకే ఇద్దరు ఎంపీలు తమ సొంత నియోజక వర్గంలో కొత్తగా క్యాంపు ఆఫీస్ లను ఏర్పాటు చేశారా? అంటే అవునంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట.…
కాంగ్రెస్ లో నాటకాలు, డ్రామాలు కుదరవు అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్యకర్తలు సరిగా ఉన్నా, నేతల మద్య సమన్వయం లేదన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోమని, కేసీఆర్ తెలంగాణలో లూటీ ముగియడంతో … బంగారు భారతదేశం అంటూ దేశంలో లూటీకి కోసం వస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు పై బీజేపి డ్రామాలాడుతోందని, పార్లమెంట్‌కు తాళం వేసి తెలంగాణ…