కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు మంత్రి హరీష్ రావు.. సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు రేవంత్, కోమటి రెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయిన ఆయన.. కాంగ్రెస్ పార్టీకి ఏం చూసి ఓట్లు వేయాలి..? అని ప్రశ్నించారు.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. భవిష్యత్ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సెటైర్లు వేశారు.. ఇక, కష్టమైన సీఎం కేసీఆర్ రైతుల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తూ వడ్లు కొంటున్నారని ప్రశంసలు కురింపిచారు..…
మరో 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి… కాంగ్రెస్ నేతలతో కలిసి వెళ్లి రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసిన ఆయన.. సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష వైఖరిపై ఫిర్యాదు చేశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజా పరిస్థితులపై గవర్నర్ కు నివేదిక ఇచ్చామన్నారు.. రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. కొనుగోలు కేంద్రాలు తెరవడం ఆలస్యం వల్ల 30శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు..…
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలపై గవర్నర్ని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్. ఇవాళ ఉదయం రాజభవన్లో గవర్నర్ తమిళ సైతో సమావేశం కానున్నారు. దానికి ముందు… కాంగ్రెస్ నాయకులు సీఎల్పీ వద్ద సమావేశమై గవర్నర్ కార్యాలయానికి బయలుదేరుతారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో 28 మంది సభ్యుల బృందం గవర్నర్ తో భేటీ అవుతారు. రాష్ట్రంలో మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని కోరనుంది కాంగ్రెస్ పార్టీ. Read Also: Ukraine…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ కలిసి రైతులను దగా చేస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.. ఇక, ఢిల్లీ వేదికగా జరిగిన నిరసన దీక్షలు.. కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల డెడ్లైన్ పెట్టారు సీఎం కేసీఆర్.. 24 గంటల్లో వరి కొనుగోళ్లపై తేల్చకపోతే.. తామే ఓ నిర్ణయానికి వస్తామన్నారు. ఇదే సమయంలో.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం…
తెలంగాణలో పరిపాలన గాడి తప్పింది.. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. గవర్నర్ ఢిల్లీ పర్యటనపై స్పందించిన ఆయన.. సీఎం కేసీఆర్ తన కొడుకుని సీఎం చేయలేక తప్పించుకోవడం కోసం రాజ్ భవన్తో గొడవ పెట్టుకుంటున్నారు అని గవర్నర్ ఢిల్లీలో చెప్పారన్నారు రేవంత్రెడ్డి.. గవర్నర్ మీడియాతోనే చెప్పారన్నారు.. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జీహెచ్ఎంసీ గవర్నర్ పరిధి అని.. గవర్నర్కి సెక్షన్ 8 ప్రకారం విశేష అధికారులున్నాయి.. పరిపాలన గాడి తప్పింది కాబట్టి..…
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన ఉగాది వేడుకలు పెద్ద చర్చగా మారిపోయాయి.. సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాకపోవడంపై.. గవర్నర్ తమిళిసై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. కొందరు బీజేపీ నేతలు కూడా డుమ్మా కొట్టారు.. దీనిపై పీసీసీ చీప్ రేవంత్రెడ్డి మండిపడ్డారు.. అసలు రాజ్ భవన్లో ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి…
డ్రగ్స్ దొరికినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరయిన చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర సంస్థలకు లేఖ రాసాను గతంలోనే అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. స్పెషల్ విచారం టీం ఏర్పాటు చెయ్యాలని. హైకోర్టు కు పోయింది నేను. డ్రగ్స్ ను అడ్డం పెట్టుకుని, సినిమా వాళ్లపై టీఆర్ఎస్ వాళ్ళు పట్టు సాధించారు. నేను మళ్ళీ కోర్టుకి వెళ్తాను. దాడి చేసిన పబ్బుకు 24 గంటల సరఫరాకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సూదిని ప్రణయ్ రెడ్డి విషయంలో…
తెలంగాణలో కాంగ్రెస్- ఎంఐఎం మధ్య దోస్తీ వుందని భావిస్తున్న వేళ రాహుల్ గాంధీతో సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు క్లారిటీ లభించింది. ఢిల్లీలో జరిగిన భేటీలో కీలకాంశాలు చర్చకు వచ్చాయి. టీఆర్ఎస్, ఎంఐఎంతో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని అడిగిన సీనియర్లకు రాహుల్ బదులిచ్చారు. ఆ రెండుపార్టీలతో దోస్తీ లేదన్నారు రాహుల్ గాంధీ. సమావేశంలో తెలుగులో మాట్లాడారు మాజీ మంత్రి జానారెడ్డి. జానారెడ్డి వ్యాఖ్యలు ఇంగ్లీషులో తర్జుమా చేసి రాహుల్ కి వివరించారు టీపీసీసీ మాజీ చీఫ్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను ఏకతాటిపైకి నడిపేందుకు కీలక సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ.. విబేధాలను వదిలి అంతా కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఈ సమావేశంలో అందరి నేతల అభిప్రాయం తీసుకున్న రాహుల్.. భేటీకి సంబంధించిన విషయాలను ముగ్గురు మాత్రమే మీడియాకు వెల్లడించాలని సూచించారు. దీంతో.. సమావేశం ముగిసిన తర్వాత.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మాలో ఉన్న విబేధాలపై రాహుల్ గాంధీతో చర్చ జరిగిందని, జరిగింది జరిగి పోయింది. ఇక అందరం కలిసి పని చేస్తామని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్, ఎంఐఎం లతో సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు, రాహుల్ టికెట్లు అనౌన్స్ చేస్తారని ఆయన వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కలిసి…