ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ నేడు, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన రైతు సంఘర్షణ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ వెంట కేంద్ర రక్షణ దళం ఎన్ఎస్జి కమాండ్ తో పాటు వ్యక్తిగత జడ్ ప్లస్ సెక్యూరిటీ సిబ్బంది ఉండనుంది. బాంబు స్క్వాడ్, డాగ్ స్పైడర్ తో నిరంతర పర్యవేక్షణ.. ఎన్‌ఎస్‌జీ కమాండోలు వేదికకు వెనుక ముందు చుట్టుపక్కల రక్షణ వలయంల ఏర్పాటు చేస్తారు.
వరంగల్ కు సుమారు 50 మంది కమాండోలు వచ్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.. వరంగల్ సీపీ నుండి మొదలు పెడితే హోంగార్డు వరకు సుమారు ఒక వెయ్యి 60 మంది పోలీసులు వీధుల్లో ఉంటారు.. ఒక డీసీపీ, ఏడుగురు ఏసీపీలు, 29 మంది ఇన్స్పెక్టర్లు, 60 మంది ఎస్ఐలు, 132 మంది హెడ్ కానిస్టేబుల్, 836 మంది వివిధ విభాగాల పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.