తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. అందులో భాగంగా.. నేతల మధ్య ఉన్న అసంతృప్తులకు చెక్ పెట్టే విధంగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.. అయితే, రాహుల్‌తో సమావేశం కొనసాగుతుండగానే మధ్యలోనే సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు పార్టీ సీనిరయర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అందరితో కలిసి మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఒక్కొక్కరి అభిప్రాయాలు తెలుసుకునే పనిలో…
ఏప్రిల్ 2వ తేదీ రాత్రి రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ లో జరిగిన రేవ్ పార్టీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు పాల్గొన్నారు. వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఈ పబ్ ను నిర్వహిస్తున్నవారు బీజేపీ, కాంగ్రెస్ నేతల సన్నిహితులేనని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పిల్లలు ఎంత పెద్ద వారు అయినా పోలీసులు వదిలి పెట్టకూడదన్నారు. గతంలో హైదరాబాద్ లో…
రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేసి పార్టీని అధికారంలోకి తేవడానికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం అధికారమే లక్ష్యంగా 2023 ఎన్నికలకు క్యాడర్ ని సమాయత్తం చేయాలని భావిస్తోంది. ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. రాహుల్ తో సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటూ ఇతర…
తెలంగాణలో ఈసారి ఎలాగైనా జెండా ఎగురవేయాలని ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాయి ఆ పార్టీ శ్రేణులు.. కొన్ని ప్రాంతాల్లో ఊహించినదానికంటే ఎక్కువగా సభ్యత్వ నమోదు కావడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టుగా చెబుతున్నారు. అయితే, అంతర్గత కుమ్ములాటలు మాత్రం ఆ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి.. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత.. కొంత మంది సీనియర్లు అలకబూనారు.. కొందరు తిరిగి లైన్లోకి వచ్చినట్టే…
తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వ విప్ బాల్క సుమన్ టీపీసీసీ ప్రెసిడెండ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో బాల్క సుమన్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బాల్క సుమన్ బెదిరిస్తే మేము బెదిరేవాళ్ళం కాదని ఆయన స్పష్టం చేశారు. మేము డ్రగ్స్, కరెంట్, సంక్షేమ పథకాల మీద సవాల్ విసిరాం సమాధానం లేదని ఆయన మండిపడ్డారు.కేసీఆర్ కుటుంబానికి బాల్క…
రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్.. ఆయన అడుగుపెట్టడంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ జీరో కాబోతోంది అని వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద.. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి ఫాల్తూ మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.. పార్లమెంట్ సెంట్రల్ హాల్ ఇమేజ్ను అపహాస్యం చేసేలా రేవంత్ మాట్లాడారని.. బీసీ జనగణను తక్కువ చేసి వ్యాఖ్యానించారని.. వెంటనే బీసీలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. రేవంత్ రెడ్డిని ఇప్పటికే…
తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీబచేసిన ట్వీట్ పై టీఆర్ఎస్ నేతలు పోటీ పడి కామెంట్స్ చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుంటారని భావించాం. కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ గురించి, ఈ దేశం గురించి కేటీఆర్ కు అవగాహన లేదు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తున్నా, నిజమో కాదో, తండ్రి కేసీఆర్ ను అడిగి కేటీఆర్ తెలుసుకోవాలి.…
కరోనాతో కూలీలు ఉపాధి కోల్పోయారు. పేదలకు సాయం అందించడం మానేసి జేబు దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వాలు..పెట్రో ధరలు విపరీతంగా పెంచుతుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఒకరి తప్పు..ఇంకొకరు కప్పి పుచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నాయి. విద్యుత్ చార్జీలు పెంచడంతో 5 వేల కోట్లు.. సర్ చార్జి పేరుతో మరో అరు వేల కోట్లు దోచుకుంటున్నదన్నారు రేవంత్.…
కరోనాతో కూలీలు ఉపాధి కోల్పోయారు. పేదలకు సాయం అందించడం మానేసి జేబు దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వాలు..పెట్రో ధరలు విపరీతంగా పెంచుతుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఒకరి తప్పు..ఇంకొకరు కప్పి పుచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. పీసీసీ చీఫ్‌తో సీనియర్ల పంచాయితీ పాకాన పడింది. రాహుల్ గాంధీ ఏరి కోరి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి పనితీరును పార్టీ విధేయులుగా చెప్పుకునే పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ప్రతిష్ట కన్నా తన వ్యక్తిగత ఇమేజ్‌ని పెంచుకునే ఎజెండాతో రేవంత్ పనిచేస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్‌లో ఇంటిపోరు కొత్త కాదు. వర్గపోరు, వర్గ భేటీలు కూడా కొత్త కాదు. అయితే నేటి రాజకీయ పరిస్థితులు మునపటిలా లేవు.…