తెలంగాణలో వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని తెలిపారు తెలంగాణ పీసీసీ చీప్ రేవంత్‌రెడ్డి.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారాయన.. ఈ సందర్భంగా ఎన్నికలు, అధికారం గురించి మాట్లాడుతూ.. 2023 నుంచి 2033 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 94 నుంచి 2004 టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ పార్టీలు పదేళ్లు అధికారంలో ఉన్నాయన్నారు. ఇక, ప్రజల్లో వచ్చిన మార్పును కేసీఆర్ ముందే పసిగట్టారన్న రేవంత్.. అందుకే.. కాంగ్రెస్ వదిలి.. బీజేపీ టార్గెట్ చేస్తూ.. ఆ పార్టీని పెంచే ప్రయత్నాలుచేస్తున్నారంటూ మండిపడ్డారు.
Read also: KA Paul: కేటీఆర్‌కు వార్నింగ్.. నువ్వు పుట్టకముందే ప్రపంచాన్ని వణికించా..
సీఎం కేసీఆర్ రాక్షస రాజకీయ క్రీడకు తెరలేపారు.. కుటుంబ పాలనతో రైతులు చితికిపోయారన్నారు రేవంత్‌రెడ్డి.. దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం సమస్యను సృష్టించారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రంలో రైతులు బాగుపడేలా పాలన చేయొచ్చు.. కానీ, అన్ని వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడిస్తారన్న సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు..