RS Praveen: కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ను కుట్ర ప్రకారం కూల్చివేశాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేలుళ్ళు వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారన్న అనుమానం ఉందన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణం బీజేపీ, కాంగ్రెస్ లే కారణమని ఆరోపించారు. రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు... వారి అనుచరుల ఫోన్ కాల్స్ టేడాను బయటకు…
‘పదవులు మీకే.. పైసలూ మీకేనా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్లకు, సీసీ రోడ్డు కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి నిధులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు.. తన నియోజకవర్గ అభివృద్ధికి అయినా డబ్బులు ఇవ్వండి అని సీఎంను రాజగోపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో నిర్వహించిన…
దేశ విదేశాలు తిరుగుతూ పెట్టుబడుల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విదేశీ సంస్థలను ప్రోత్సహించిన తాము.. ఈ దేశ, రాష్ట్ర సంస్థలను ఎందుకు ప్రోత్సహించమో జర ఆలోచించాలన్నారు. మిమ్మల్ని (రాష్ట్ర సంస్థలు) ఎందుకు వదులుకుంటాం అని, అపోహలు సృష్టించే వాళ్లతో ప్రయాణిస్తే ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని, అప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత తనది…
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ.. తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్గా నిలబెట్టాం అని చెప్పారు. ద్విముఖ విధానంతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. తమ ఆలోచనలో స్పష్టత ఉందని, అమలులో పారదర్శకత ఉందన్నారు. అందరినీ కలుపుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని తాము ఎంచుకున్నాం అని…
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్రంగా వాడుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుసినప్పుడు గతంలో పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి భేరీజు వేడుకోండన్నారు. ఎంత భారీ వర్షం పడినా గంటా, రెండు గంటల వ్యవధిలోనే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి.. వరద నీటిని మళ్లించడంలో హైడ్రా బాగా పని చేస్తోందని ప్రశంసించారు. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్…
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. సీఎంపై నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. 2019 అక్డోబర్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్.. కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. Also Read: Hydra Marshals: వీక్ ఆఫ్ ఇవ్వడం లేదు..…
Gate Way Of Hyderabad : హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియాలో చేపట్టే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ను బహుళ ప్రయోజనాలుండేలా అత్యంత అధునాతనంగా నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హైదరాబాద్ ముఖద్వారంగా హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ దగ్గర ఓఆర్ఆర్ పై గేట్ వే అఫ్ హైదరాబాద్ నిర్మించాలని సూచించారు. ఓఆర్ఆర్ కు ఒక వైపున ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి…