పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని.. విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Telangana Floods : డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మంచి మనసు చాటుకున్నాడు. తెలంగాణలో వరదలు భారీగా నష్టం చేశాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో విధ్వంసం జరిగింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముందుకొచ్చారు. తన భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళాన్ని అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా ఈ రోజు చెక్ ను అందించారు. ఇక్కడి…
తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగించింది కేంద్రం. మరో ఏడు నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 మార్చి నెల వరకు పదవీ కాలం పొడిగించింది. ఈ నెల 31న రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసు పొడిగించాలని డివోపిటిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మరో 7 నెలలు సర్వీసు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఏఐఎస్ (సీఎస్–ఆర్ఎం)…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్‌లోని ఓటర్ అధికార యాత్రకు మద్దతు తెలుపుతూ ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి కూడా బీహార్‌లో చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.
CM Revanth Reddy : హైదరాబాద్‌లో జరిగిన బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య ప్రసంగం చేశారు. జీవవిజ్ఞానం, వైద్య రంగం, ఆవిష్కరణల ప్రాధాన్యం గురించి ఆయన విశ్లేషిస్తూ తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. “దేవుడు ఒక మంచి డిజైనర్, ప్రకృతి మంచి గురువు. మనం మంచి విద్యార్థులమా కాదా అనేది ప్రశ్న,” అని సీఎం రేవంత్ అన్నారు. జీవశాస్త్రం, వైద్య రంగంలో ప్రకృతినే మనకు…
పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో బై ఎలక్షన్ తప్పక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 3 నెలలు లేకుంటే.. 6 నెలల సమయంలో ఎన్నికలు వస్తాయన్నారు. దమ్ముంటే పార్టీ మారిన నియోజకవర్గాల్లో రాజీనామా చేసి రండి ఎన్నికలకు రండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికలకు వెళితే కేసీఆర్ ఏంటో, రేవంత్ రెడ్డి ఏంటో తెలుస్తుందన్నారు. బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్‌కు బై బై చెప్పే…
ఓట్ల చోరీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపునకు స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఓట్ల చోరీ వ్యతిరేక ప్రచారానికి సంబంధించిన ప్రత్యేక లోగోను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్మాణం, పీఏసీ అజెండాపై చర్చిస్తున్నారు.