తెలంగాణ కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే మునుగోడులో ఉప ఎన్నికల అనివార్యమయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కమ్యునిస్టు సోదరులు… మా కార్యకర్త బంధువులకు విజ్ఞప్తి. కాంట్రాక్టుల కోసమే పార్టీలు అంటే… ప్రజాస్వామ్యం బతకదు అని ఆయన వ్యాఖ్యానించారు. చేతులు ఎత్తి చెప్తున్నా.. తెలంగాణది నిలబడి కొట్లాడి సంసృతి. దాన్ని కాపాడండి. ప్రలోభాలకు లొంగకుండా ఆలోచన చేయండి. కాంగ్రెస్ కు అండగా ఉండండి. సోనియా గాంధీని అవమానించిన సందర్భంలో జరిగే ఎన్నిక ఇది. రాజగోపాల్ రెడ్డి లాంటి విశ్వాస ఘాతకున్ని ఎప్పుడు చూడలేదు. మునుగోడు గడ్డ మీద పాతి పెడదాం.
మండలాల వారీగా పర్యటన చేస్తా. అందరినీ కలుస్తా.. ప్రతీ ఊరు…గూడెం వస్తా. కాంగ్రెస్ కార్యకర్త మీద ఈగ వాలకుండా చూస్తా. రాంరెడ్డి దామోదర్ అన్న గంటలో వస్తాడు. నేను రెండు గంటల్లో వస్త. అండగా మేము ఉంటాం. నా మీద గుడ్లు వేయించాలని రాజగోపాల్ రెడ్డి చూశాడు. నా మీద గుడ్లు పడితే… మీ ఇంట్లో పెండ పడుతుంది. రాజగోపాల్ రెడ్డి ఏదో అనుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తకి సాయం మరింత చేసే బాధ్యత నాది. పార్టీ కష్టాల్లో ఉంది.. కార్యకర్తలు అండగా ఉండండి. చేతులు ఎత్తి దండం పెడుతున్న. నన్ను ఒక్కడిని చేసి… ఎంతో మంది తిడుతున్నారు. ఎవడు ఇక్కడ భయపడడు.. నా వెంట్రుక కూడా పీకలేరు. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.