తెలంగాణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాకరేపుతోంది. బీజేపీలో చేరబోతున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన మనసులోమాట బయటపెట్టారు. సీఎం కావడానికే బీజేపీలోకి వస్తున్నా అన్నారు.ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. మునుగోడులో రాజకీయాలు మారతాయి. 100 శాతం మునుగోడు ప్రజలు నావైపే వున్నారు. తెలంగాణ ప్రజలు నియంత పాలన చేస్తున్నారు. మునుగోడుకి రాజీనామా చేయండి.. త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది. బాధతో రాజీనామా చేశా.. సోనియా, రాహుల్ అంటే గౌరవం అన్నారు రాజగోపాల్ రెడ్డి.