రేవంత్ రెడ్డి పది పనులు చేస్తున్నప్పుడు ఒకటో రెండో తప్పులు దొర్లడం సహజమే.. మనమంతా మానవ మాత్రులమే అన్న టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. నేడు బోయిన్ పల్లిలో జరిగిన పార్టీ అవగాహన సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జానారెడ్డి, భట్టి, మధుయాష్కీ, సంపత్ మాటలను సూచనలను స్వాగతిస్తున్నాం. ఆచరిద్దామన్నారు. జానారెడ్డి సూచనలు సలహాలతో పార్టీని మూలములకు తీసుకెళ్దామని, ప్రజలకు నష్టం జరిగే చర్యలకు కాంగ్రెస్ పాల్పడదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ ప్రజలను నయవంచన చేస్తున్నాడన్నారు. కేసీఆర్ నాయకత్వములో దగా పడని వర్గం దోపిడీకి గురికాని వర్గం లేదని, కేసీఆర్ పాలనలో అడుగడుగునా భయం ఉందన్నారు. పోలవరం మీద కేసీఆర్ విధానం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు పొక్క మీద ని విధానం ఏంటని, కృష్ణ.. గోదావరి జలాల విధానంలో ఎవరి వైపు అని ఆయన అన్నారు. ఏపీలో తల మాసిన కొందరిని కేసీఆర్ చేర్చుకున్నారన్న రేవంత్.. ఏపీ ఆస్తులు.. విద్యుత్ బకాయిలలో కేసీఆర్ ఎవరి పక్షమన్నారు.
Also Read : Gautham Gambhir: ఐపీఎల్ కంటే ప్రపంచకప్ గెలవడం ముఖ్యం.. ఆటగాళ్లపై పనిభారం తగ్గించాలి
తెలంగాణ వైపా.. ఆంధ్ర వైపా అని ఆయన ప్రశ్నించారు. చెప్పు కేసీఆర్ అంటూ ఆయన ప్రసంగించారు. అన్ని త్యాగాలు చేసి కాంగ్రెస్ తెలంగాణని ఇచ్చిందని, ఇప్పుడు కేసీఆర్ ఆంధ్ర గట్టునెక్కి నిలబడ్డాడన్నారు. ఐపీఎస్ లలో తెలంగాణ వాళ్లకి న్యాయంగా పోస్టింగ్‌లు దక్కాయా అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి కేటాయించిన సోమేష్ కుమార్ తెలంగాణకు సీఎస్.. ఏపీకి కేటాయించిన అంజనీకుమారు తెలంగాణకు డీజీపీ.. ఇదేనా తెలంగాణ అధికారులకు ఇచ్చిన గౌరవమన్నారు. మనలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చని, కానీ తెలంగాణ ప్రజలు ఎన్నో సమస్యలని ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉన్న సమస్యలతో పోలిస్తే మన సమస్యలు పెద్ద సమస్యలు కావని, ప్రజల ఆవేదన దుఃఖముందు మనవి చాలా చిన్నవన్నారు. పార్టీ అధికారం లోకి రావాలంటే.. పదవిని కూడా వదిలేసేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఎవరిని కూర్చోపెట్టినా పల్లకీ మోస్తానని, నేను త్యాగం చేస్తే కాంగ్రెస్ అధికారంలో కి వస్తది అంటే… నేను రెడీ అని ఆయన అన్నారు. మాట వరుసకు చెప్పడం లేదని ఆయన వెల్లడించారు.
Also Read : OFF The Record: ఎమ్మెల్యే శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రఘురాజు మధ్య వైరం.. కారణం ఏంటి ?