తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత కొండా సురేఖ. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలు ప్రస్తావించారు. పేదల గురించి కాంగ్రెస్ ఆలోచించిందన్నారు. పెద్దల గురించి బీజేపీ, బీఆర్ఎస్ ఆలోచిస్తున్నాయని కొండా సురేఖ అన్నారు. వైఎస్సార్ టీపీ అనేది వైఎస్ షర్మిల స్వంత ప్రయోజనాలకు పెట్టింది. తన అన్నను కాదని, తెలంగాణ కోడలిని అని ఇప్పుడు చెప్పుకోవడం హాస్యాస్పదం అన్నారు.జగన్ కి అభద్రతా భావం ఎక్కువన్న కొండా సురేఖ.. షర్మిల పార్టీ వెనుక స్వార్థం వుందన్నారు. తెలంగాణలో ఇతర పార్టీల ఓట్లు చీల్చడానికే తప్ప ఆ పార్టీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు కొండా సురేఖ. రేవంత రెడ్డి పాదయాత్ర చేసేది ఆయన కోసం కాదు, పార్టీ కోసమే అన్నారు. పాదయాత్ర ప్రారంభిస్తే అంతా కలిసి రావాలన్నారు.
బీఆర్ఎస్ పై బీజేపీ పోరాటం చేస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం, గ్రానైట్ మాఫియా విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు కొండా సురేఖ. బీఆర్ఎస్ ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ నేతలు వ్యూహాత్కంగా వ్యవహరించాలన్నారు. కాంగ్రెస్ నేతలంతా ఒకే మాట, ఒకే బాటగా ముందుకు సాగాలన్నారు. ఏఐసీసీ అధిష్టానం పిలిచినా ఉత్తమ్ కుమార్ రెడ్డి బోయిన్ పల్లి సమావేశానికి వెళ్ళకపోవడం ఏంటని ఆమె అన్నారు. పార్టీ నేతలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టో ఆలోచించాలన్నారు.
వైఎస్సార్ టీపీ వల్ల కాంగ్రెస్ ఓట్లు చీలతాయన్నారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికే బీఆర్ఎస్, బీఎస్పీ పనిచేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కర్నాటక తరహాలో తెలంగాణ నేతలు కూడా కలిసి పాదయాత్ర చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా పనిచేయాలన్నారు. ఎవరితో పొత్తుపెట్టుకున్నా విభేధాలు బయటకు వస్తాయన్నారు. కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి నడవడం కష్టం అన్నారు. వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ తో కలిసి నడిచే అవకాశం లేదన్నారు.
Read Also:Mother Suicide: కొడుకు చావును చూడలేక ముందే తనువు చాలించిన తల్లి
మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. కాంగ్రెస్ కి ఉత్తమ్ వల్ల ప్రయోజనం లేదన్నారు. ఆయన హయాంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. చిన్నచిన్న పదవులు కోసం పార్టీకి నష్టం కలిగించవద్దన్నారు. సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి విషయంలో ఇరువర్గాల నేతలు గౌరవంగా ఉండాలన్నారు. పీసీసీ పీఠంలో ఎవరు ఉన్నారనేది చూడాలి. ఆయన ఏ పార్టీ నుంచి వచ్చారో చూడవద్దు. కాంగ్రెస్ నేతలు వెళ్ళి బీజేపీలో చేరారు. నాకు ఆ ఉద్దేశం లేదు. పార్టీలో చేరాలని భావిస్తే మీకే చెబుతానన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటుందన్నారు.
Read Also: Team India: హైదరాబాద్ చేరుకున్న టీమిండియా.. రేపు ప్రాక్టీస్ షురూ..!!