హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఎల్లుండి (గురువారం) జరగనున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో సీఎం ఎంపిక పూర్తైంది. ఇక, మంత్రివర్గం కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానం నజర్ పెట్టింది. ఏఐసీసీ నేతలు రేవంత్ రెడ్డితో చర్చించి మంత్రివర్గం ఖరారు చేయనున్నారు. అయితే, మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలి.. ఎవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలనే దానిపై రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం చర్చించే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ఈ నెల 7న పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆయన వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపించింది. ఇక, సీఎం ఎంపికపై రెండు రోజుల పాటు చర్చించిన అందరి ఏకాభ్రియంతో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఏఐసీసీ ఫైనల్ చేసింది.
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్.. మంత్రులు ఎవరు, ఎల్లుండి ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు? అనే విషయాలు తర్వాత చెబుతాం అన్నారు.. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుంది.. అంతా టీమ్‌గా పనిచేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేసీ వేణుగోపాల్.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే, గత రెండు రోజులుగా తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగిన చివరకు కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరుని ప్రకటించింది.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. దీంతో.. తెలంగాణకు కాబేయో సీఎం రేవంత్‌రెడ్డి అనేది స్పష్టమైంది.. పీసీసీ చీఫ్ ని సీఎల్పీ నేత గా చేయాలని నిర్ణయించాం.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని.. అయితే, ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు అనేది తర్వాత చెబుతాం అన్నారు కేసీ వేణుగోపాల్.
Revanth Reddy: తెలంగాణ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొని ఉంది. నిన్న జరిగిన సీఎల్పీ మీటింగ్ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్యెల్యేలంతా ఏకవాఖ్య తీర్మానం చేసి, సీఎం అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని హైకమాండ్‌కే వదిలేశారు. నిన్నటి నుంచి హైకమాండ్ తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై తలమునకలై ఉంది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో కీలక సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
నేను పీసీసీగా ఉన్నప్పుడు ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై ఇంత వ్యతిరేక లేకపోవడంతో పాటు మరోసారి కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు అందుకే.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ రాలేదు.. ప్రతి ఎన్నికలకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి.. కానీ, ఇప్పుడు పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించాము.