తెలంగాణ రాజ్ భవన్ కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో పాటు ఇతర సీనియర్ నేతలు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కు కాంగ్రెస్ బృందం అందజేసింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇవాళ మధ్యహ్నం ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణకు వచ్చాక తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించిన నేపథ్యంలో వారిద్దరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కాగా, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో ఆయన సమావేశం అయ్యారు. రేపు (గురువారం) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరగబోయే తన ప్రమాణస్వీకారానికి వారిని ఆహ్వానించారు.
Revanth Reddy Swearing Ceremony Time Changed: తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. గురువారం (డిసెంబర్ 7) మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. గురువారం ఉదయం 10.28 గంటలకు రేవంత్ ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగా నిర్ణయించగా.. తాజాగా ఆ సమయంలో స్వల్ప మార్పు జరిగింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.…
తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, తొలి సంతకం దేనిపై చేస్తాడు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్ మీద తొలి సంతకం చేయాలని నిర్ణయించారు.
హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కొత్త ఎమ్మెల్యేలకు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ
రెండో రోజు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. నిన్న (మంగళవారం) రాత్రి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఎంపీ మాణిక్కం ఠాగూర్ తో ఆయన సమావేశం అయ్యారు. అయితే, ఇవాళ ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ తో ఆయన భేటీ కానున్నారు.
Nandamuri Balakrishna: పదేళ్ల బీఆర్ ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ చెక్ పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వియజయకేతనం ఎగురవేసింది. ఇక గత రెండు రోజుల నుంచి తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరు.. ? అనేది ఎంతో ఉత్కంఠను రేకెత్తించింది. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి.. ఇలా సీఎం పదవి కోసం లైన్లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఎల్లుండి (గురువారం) జరగనున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.