KA Paul Meets CM Revanth Reddy; తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కేఏ పాల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. జనవరి 30న జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డిని తాను ఆహ్వానించానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు కేఏ పాల్ తెలిపారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తాను కలిసినట్లు కేఏ పాల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. తాను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు వెళ్లానని, జనవరి 30న ప్రపంచ శాంతి సదస్సుకు ఆహ్వానించానని, శాంతి సదస్సుకు వస్తానని సీఎం చెప్పారని కేఏ పాల్ తెలిపారు. గ్లోబల్ పీస్ సదస్సుకు కావాల్సిన అనుమతులను మంజూరు చేయాల్సిందిగా సీఎంను ఆయన కోరారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి, కేఏ పాల్ భేటీకి సంబందించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read: KCR: రోడ్డు ప్రమాద ఘటనలపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. ఎక్స్ గ్రేషియా చెల్లించాలని..!
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి జ్వరం బారిన పడినట్లు తెలుస్తోంది. గత మూడు రోజుల నుంచి జ్వరం, గొంతు నొప్పితో సీఎం బాధపడుతున్నట్లు సమాచారం. ఇంటి వద్దే ఫ్యామిలీ డాక్టర్ ఆయనను పరీక్షించి.. మందులు ఇచ్చినట్లు తెలుస్తోంది. జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్న సీఎంకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఆదివారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో రేవంత్ కొంత నీరసంగా కనిపించారట.